కరోనా వల్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దాంతో ఎక్కడి వారు అక్కడే  ఉండిపోయారు. ముఖ్యంగా వలస  కార్మికుల పై ఈ లాక్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని  చూపించింది. అటు సొంత ఊళ్లకు వెళ్లలేక  ఇటు చేసుకోవడానికి పని లేక వారు నానా ఆవస్థలు పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు వారిని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా వారికి వసతిని  ఏర్పాటు చేయడం తో పాటు రేషన్ ను కూడా ఇస్తుంది. 
 
ఇక రాజస్థాన్ లోని శిఖర్ కు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలనుండి బ్రతుకు దెరువు కోసం రోజువారీ కూలీలు వలస వచ్చారు. లాక్ డౌన్  అమలులోకి రావడం తో వారికి పల్సానా లోని గవర్నమెంట్ స్కూల్ లో వసతి కలిపించారు. అయితే వారిని అన్ని విధాల ఆదుకున్న ఆ ఊరి కోసం ఏదోకటి చేయాలని భావించిన ఆకార్మికులు వారు ఉంటున్న స్కూల్ కు రంగులు వేశారు. 9 సంవత్సరాల నుండి ఆ స్కూల్ కు రంగులు వేయలేదు.
 
ఇప్పుడు వలస కార్మికుల వల్ల ఆ స్కూల్ కొత్త దానిలా మారిపోయింది. ఆ ఊరి సర్పంచ్ మరియు స్కూల్ యాజమాన్యం కలిసి  కలర్లను తెప్పించ గా క్వారెంటైన్ లో వున్న వలస కార్మికులు పెయింటింగ్ పని పూర్తి చేశారు. ఈపని చేసినందుకు డబ్బులు తీసుకోవడానికి కూడా వారు నిరాకరించారు. లా ఆ ఊరి పై వలస కార్మికులు తమ  అభిమానాన్ని చూపారు. ఇదిలావుంటే ప్రస్తుతం దేశంలో కరోనా రోజు రోజు కు విజృంభిస్తుంది. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 1500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం ఇప్పటివరకు కేసుల సంఖ్య 20000 దాటాగా అందులో  650కి పైగా కరోనా వల్ల మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: