బంగారు పండుగ అక్షయ తృతీయకు సమయం దగ్గరపడుతోంది. వివాహాది శుభకార్యాలకే కాదు...బంగారం కొనేందుకు ముహూర్తంగా భావించే పర్వదినం అక్షయ తృతీయ. ఎంతో కొంత బంగారం కొంటేచాలు..ఏడాదంతా ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఓ నమ్మకం. కాని ఇప్పుడు కరోనా లాక్ డౌన్ ఉంది? గోల్డ్ షాపులు తెరిచే చాన్స్ లేదు ? మరి ఈ సెంటిమెంట్ ఉన్నవాళ్లు ఏం చేయబోతున్నారు? 

 


దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 20 నుంచి కేంద్రం కొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది లాగా ఈ సారి కూడా అక్షయ తృతియా ఏప్రిల్ 26 న వచ్చింది. అయితే లాక్ డౌన్ ఉండడంతో అక్షయ తృతియ రోజు ఎంతో కొంత బంగారం కొంటున్న వారు ...ఈ సారి ఏం చేయాలి అన్న చర్చ మొదలైంది. గోల్డ్ షాపులు తెరిచి ఉంటే బయటకు వెళ్లి ...బంగారం కొని సెంటిమెంట్ ను కొనసాగించేవారు. ఇటు గోల్డ్ షాపులు కూడా అక్షయ తృతియా ఆఫర్లు కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

 

అక్షయ తృతియ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఉన్నవారైన ...లైనివారైన సరే ఎంతోకొంత పసిడిని కొని సంతోషపడతారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు . ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల్లో పండితులు అక్షయ తృతియ రోజు ఏం చేయాలో సలహలు సూచనలు ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి ...అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. అక్షయ తృతియ రోజు ఏం చేస్తే మంచిదో చెబుతున్నారు .

 

ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో పలు గోల్డ్ షాపులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పలు కంపెనీలు అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న కస్టమర్లకు గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికేట్లను పంపేందుకు సిద్దం అవుతున్నాయి. మొత్తానికి ఏదో ఓ విధంగా సెంటిమెంట్ ఫాలో అయ్యామన్న సంతృప్తి చెందితే చాలనుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: