దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20,000 కు చేరువలో ఉండగా 650 మంది మృతి చెందారు. ప్రధాని మోదీ ఏప్రిల్ 14 లోపు కరోనా ఉధృతి తగ్గుతుందని భావించినా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. దీంతో మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. 
 
మే 3వ తేదీ లోపు పరిస్థితి అదుపులోకి వస్తుందా అనే ప్రశ్నకు రాదనే సమాధానం వినిపిస్తోంది. మే 22వ తేదీ నాటికి దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. టైమ్స్ నెట్‌వర్క్‌ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ప్రోటివిటీతో కలిసి చేసిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. మూడు వేరువేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని చేసిన ఈ సర్వేలో మే 22వ తేదీ నాటికి భారత్ లో 75,000 కేసులు నమోదవుతాయని తేలింది. 
 
పర్సంటేజ్ మోడల్, ది టైమ్ సీరిస్ మోడల్, సస్పెక్టబుల్ ఎక్స్‌పోజ్డ్ ఇన్‌ఫెక్టెడ్ రికవర్డ్ (సెరి) మోడల్ ద్వారా సర్వే చేసి ఈ విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ లాక్ డౌన్ ను మే 15 వరకు పొడిగిస్తే సెప్టెంబర్ 15 నాటికి దేశంలో కరోనా అదుపులోకి వస్తుందని... మే 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తే జూన్ మధ్య నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెబుతోంది. మరోవైపు దేశంలో లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
లాక్ డౌన్ వల్ల దినసరి కూలీలు, పేద ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: