తెలంగాణ రాష్ట్రంలో కరోనా  విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. మొదట్లో అతి తక్కువగా నమోదైన కేసులు ప్రస్తుతం పదుల సంఖ్యలో నమోదు అవుతూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే మొదట కరోనా వైరస్ ను  లైట్ తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత కరోనా ప్రళయాన్ని  అర్థం చేసుకుని కరోనా  వైరస్ కట్టడికి  కఠిన చర్యలు అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లాక్ డౌన్ విధిస్తూ ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలయ్యి   నెల రోజులు కావస్తోంది. అయితే లాక్ డౌన్  ప్రకటించక ముందు లాక్ డౌన్  ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 

 

 

 దీనిపై తెలంగాణ ప్రజానీకం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కంటికి కనిపించకుండా దాడి చేసి కాటికి  పంపిస్తున్న కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు అందరూ ఏకమై పోరాటం చేస్తున్నప్పటికీ కరోనా  మాత్రం కోరలు చాస్తోంది విజృంభిస్తునే  ఉంది. ముఖ్యంగా లాక్ డౌన్  అమలులో ఉన్న సమయంలో కూడా కరోనా కట్టడి  కాలేదు అని స్పష్టం గా తెలుస్తోంది. ఎందుకంటే లాక్ డౌన్  ప్రకటించక  ముందు తెలంగాణలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21... కానీ లాగ్ డౌన్  ప్రకటించిన నాటి నుంచి నేటికీ నెల కావస్తుండగా  ప్రస్తుతం కరోనా  వైరస్ కేసుల సంఖ్య 928.

 

 

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణ రాష్ట్రానికి కూడా పట్టిపీడిస్తోంది. క్రమక్రమంగా రోజురోజుకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే తెలంగాణ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బతుకుతుంది. సరిగ్గా లాగ్ ప్రకటించక ముందే తెలంగాణ రాష్ట్రంలో 21 కోట్లు మాత్రమే ఉండగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే 928 చేరుకుంది తెలంగాణలో కరోనా  కేసుల సంఖ్య. మార్చి 30 నాటికి తెలంగాణలో 76 కరోనా  వైరస్ కేసులు నమోదు కాగా... ఏప్రిల్ ఏడో తేదీ వరకు ఏకంగా 404 కరోనా  కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14 నాటికి 644 పాజిటివ్ కేసులు... ఇలా క్రమక్రమంగా కరోనా కేసులు  పెరిగిపోతునే ఉన్నాయి.  నిన్న ఒక్కరోజే 57 కరోనా  వైరస్ కేసులు  నమోదు కావడంతో రాష్ట్రంలో 928 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సూర్యాపేట గద్వాల వికారాబాద్ జిల్లాలో కరోనా వైరస్ విస్తరణ ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: