ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై అటు భారతదేశం కూడా అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదు అయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పోయింది. కరోనా విజృంభణ  ఎక్కువగా కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది కేంద్రప్రభుత్వం. ఇలా చర్యలు చేపట్టి కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది అని చెప్పాలి. ఎందుకంటే కఠిన నిబంధనలు ఉండే అగ్రరాజ్యాలతో సైతం కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయలేక లక్షల మంది  ప్రజలు ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతుంటే... ఎంతో మంది మృత్యుఒడిలోకి చేరుతున్నారు. అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా కట్టడి చేయడం కారణంగానే కేవలం 20వేల కేసులు మాత్రమే భారతదేశంలో నమోదయ్యాయి. 

 

 

 భారతదేశం నుంచి కరోనా  వైరస్ ని తరిమి కొట్టడం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ముందడుగు వేస్తున్నాయి. ప్రతి అడుగులో విజయం సాధిస్తూ క్రమక్రమంగా కరోనా వైరస్ ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారత ప్రజలందరిలో ప్రాణభయం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత భారత ప్రజలందరూ కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నప్పటికీ... ఈ మహమ్మారి వైరస్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో.. ఎటు నుంచి దాడి చేసి ప్రాణాలను హరించుకు పోతుందో అనే  భయంతోనే భారత ప్రజలందరూ బతుకుతున్నారు. 

 

 

 అయితే ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది కరోనా  వైరస్ బారినపడి తీవ్ర భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా  రోగులకు ఒక తీపి కబురు అందింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా  మీద విజయం సాధించడానికి మనం సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలు వస్తున్నాయి. కరోనా  వైరస్ రోగులపై నిర్వహించిన ప్లాస్మా తెరఫీ విజయవంతం అవుతుండడమే  దీనికి నిదర్శనం. ఢిల్లీకి చెందిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతనికి ప్లాస్మా తెరఫీ నిర్వహించారు వైద్యులు. అయితే అతి తక్కువ సమయంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడమే కాకుండా కరోనా వైరస్ నెగిటివ్  రావడం అందరిలో ఆనందాన్ని నింపింది. దీంతో కరోనా రోగులకు ఈ తరహా తెరఫీ చేయడానికి పలు రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: