ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై అన్ని దేశాలు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ప్రతి దేశం తమ శక్తికి మించి ఈ మహమ్మారి తో పోరాడుతున్నాయి. మనదేశంలో ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ప్రతిరోజు వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 వేల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిస్థితి అదుపుతప్పుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మే మూడో తేదీ వరకు దీనిని అమలు చేయబోతుండగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఈ గడువుని మరికొంతకాలం పెంచుకున్నాయి. 

 

IHG


ప్రజలు రోడ్లపైకి రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ విస్తరించకుండా అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించి, ఈ వైరస్ తీవ్రతను తగ్గించడం ఒక్కటే మార్గంగా ఉండడంతో కేంద్రం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20 వేలు దాటిన దేశాల జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో వైరస్ తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే చర్యల్లో భాగంగా టెలిఫోనిక్ సర్వే చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైరస్ లక్షణాల విషయమై సర్వే చేపట్టాలని కేంద్రం డిసైడ్ అయింది.

 

 '1921 ' నంబర్ నుంచి దేశ ప్రజల ఫోన్ నెంబర్లకు కాల్స్ రాబోతున్నాయి. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాయి. ఈ సందర్భంగా కరోనా లక్షణాలు, తదితర అంశాలపై ప్రజలకు ఫోన్ చేసి సర్వే చేపట్టబోతున్నారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, కేంద్రం కోరింది. ఇతర నెంబర్ నుంచి ఫోన్ చేసి ప్రజలను మోసం చేసే అవకాశం ఉండటంతో ముందుగానే 1921 నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేసి సర్వే చేపడతామని విషయాన్ని ఇప్పుడు కేంద్రం బహిరంగంగా ప్రకటించింది. ఈ సర్వే ద్వారా ప్రజలను అనేక రకాల ప్రశ్నలు అడగడం తో పాటు, కరోనా పై అవగాహన కల్పించే విధంగా ఈ ఫోన్ సర్వే చేపట్టి పోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: