ఏపిలో కొనసాగుతున్న లాక్ డౌన్ ఉల్లంఘించారని నగరి ఎమ్మెల్యే రోజాపై సోసల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపించాయి.  లాక్ డౌన్ పై ఆమె వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.  పుత్తూరు సుందరయ్యనగర్ లో బారుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమె నడుస్తుండగా పాదల కింద పూలు చల్లారు.. ఆమె వెనుక ఉన్న కార్యకర్తలు కనీసం సామాజిక దూరం పాటించకుండా లాక్ డౌన్ ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.

 

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబడుతున్నారు. లాక్‌డౌన్ వేళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో భారీ ర్యాలీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తనపై వస్తున్న కామెంట్స్ పై  ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా స్పందించారు.  తన నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో కరెంట్, నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... గత ప్రభుత్వం వీరి కోసం ఏమీ చేయలేదని... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు.

 

ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన తమ గోడు వినడం లేదని ప్రజలు ఎంతో బాదపడుతున్నారు.  ఆ సమయంలో అక్కడ బోరు బావి ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిసాయి.  ఆ సంతోషంతోనే ప్రజలు తనను ఆహ్వానించారని... అయితే వారు పూలు చల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. వారు ప్రేమతో చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నానని చెప్పారు. విపక్ష నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.  పిచ్చి కామెంట్స్ చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: