జగన్ అంటేనే బాబుకు పడదు, బాబుని చూస్తే జగన్ కి అంతే. ఈ ఇద్దరిదీ రాజకీయాల కంటే కూడా వ్యక్తిగత వైరంగా మారిపోయింది. అది ఎలా ఉందంటే చివరికి చంద్రబాబుకు జగన్ జన్మ దిన శుభాకాంక్షలు చెప్పినా కూడా అతి పెద్ద విశేషంగా భావించేలా సీన్ కనిపిస్తోంది. మరో వైపు చంద్రబాబు రాజకీయంగా పెద్ద మనిషిగా వ్యవహరించడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుని అసలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. చంద్రబాబు మీడియా ముందు ఎంతలా గొంతు చించుకున్నా కూడా జగన్ కనీసంగా కూడా రెస్పాండ్ అవడంలేదంటున్నారు. ఇక కరోనా, ఆ మీదట లాక్ డౌన్ వల్ల పూర్తిగా హైదరాబాద్ కి పరిమితం అయిన చంద్రబాబు ప్రతీ రోజూ మీడియా మీటింగ్ పెట్టి మరీ జగన్ని విమర్శిస్తున్నారు. ఇక సూచనలు కూడా అందులో  కొన్ని ఉంటున్నాయి.

 

కానీ జగన్ అసలు వాటిని చూస్తున్నారా అన్నది పెద్ద డౌటుగా ఉంది. ఎంత చెడ్డా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. ఆయన చెప్పిన విషయాలను కనీసం పరిశీలన చేస్తున్నట్లుగా అయినా జగన్  చెబితే పెద్దాయనకు మనశ్శాంతిగా ఉంటుంది, కానీ జగన్ మాత్రం బాబుని అలా మీడియా మీట్లు పెట్టుకోనీ అన్నట్లుగా వదిలేసి  ఉంటున్నారు.

 

ఇపుడు ఇదే బాబుకు హై బీపీ పెంచేస్తోందిట. తనకంటే వయసులో చిన్నవాడు అయిన జగన్ కనీసం తన హోదాకు, సీనియర్ సిటిజన్ గా తన వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదని మధన పడుతున్నారుట. పైగా తన మంత్రులతో, నాయకులతో నానా తిట్లూ తిట్టిస్తున్నారని కూడా బాధపడుతున్నారు. మరో వైపు అఖిల పక్ష సమావేశానికి కూడా జగన్ని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రం మీ జాగీరు కాదు అంటున్నారు.

 

అయిదు కోట్ల మంది ప్రజల జీవితాలు, ప్రాణాలూ మీ రాజకీయాలకు బలి కావాలా అని కూడా గట్టిగానే నిలదీస్తున్నారు. బహుశా ఇవన్నీ కూడా జగన్ కి మండిస్తున్నాయనుకోవాలేమో. మొత్తానికి జగన్ బాబుకు దేనికీ రిప్లై ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని అర్ధమవుతోంది. దీంతో బాబు ఎలాగైనా జగన్ని కదిలించాలని ప్రతీ రోజు మరింతగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాబుని ఎలా ఇరిటేట్ చేయాలో జగన్ కే తెలుసులా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: