దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20000కు చేరగా మృతుల సంఖ్య 650 దాటింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించారు. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించాయి. అందువల్ల కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
 
దాదాపు అన్ని రంగాలు లాక్ డౌన్ వల్ల నష్టాలను చవిచూస్తున్నాయి. పరిశ్రమలు, వ్యాపారాలు, అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. కానీ ఐటీ రంగం మాత్రం అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. 70 - 80 శాతం ఐటీ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు. దాదాపు 37 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని ఒక సర్వే తేల్చింది. ప్రస్తుతం ఏ కంపెనీల ఉద్యోగులైతే పని చేస్తున్నారో వారి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతుంది. 
 
 
దేశంలో కేంద్రానికి ఐటీ రంగమే ఆదాయం చేకూర్చడంతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఆ రంగం అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. అయితే ఐటీ ఉద్యోగుల అనుబంధ సంస్థలు మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మాల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ ఇవన్నీ లాక్ డౌన్ వల్ల మూతబడ్డాయి. భవిష్యత్తులో ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మే 3వ తేదీ లోపు దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైద్యులు మాత్రం కరోనాకు మందు అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: