ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది.  లాక్ డౌన్ ఉల్లంఘించే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుక సిద్దం అయ్యారు.  పాస్ లు లేకుండా పనీ పాటా లేకుండా బయటకు వచ్చేవారి బండ్లు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  తెలంగాణలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  మెడిసెన్స్ కొనుగోలు కోసం దివ్యాంగులు వేరే వారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి..అలాంటి వారికి  పోలీసులు పాస్‌లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది.  

 

కాగా, లాక్ డౌన్ కఠినంగా వ్యవహరిస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గణేష్ కర్నాటి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.  ఈ విచారణ తర్వాత దివ్యాంగులకు అవసరమైన అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల వైద్య సిబ్బందికి వివరించాలని హైకోర్టు తెలిపింది.

 

జిల్లా సంక్షేమ అధికారులు తమ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వివరాలు సేకరించి వారి బాగోగులు చూసుకోవాలని తెలిపింది.  దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను మీడియా ద్వారా ప్రచారం చేయించాలని ఆదేశించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ మే 13లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: