ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు సరైన విరుగుడు లేదు అన్న విషయం తెలిసిందే. కానీ భారత్లో మలేరియా వ్యాధికి వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్  మందు కరోనా  వైరస్ ను ఎదుర్కోవడానికి బాగా పనిచేస్తుంది అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కూడా మలేరియాకు ఉపయోగించే ముందు హైడ్రోక్సి క్లోరోక్విన్  మందులు ఇండియా నుంచి భారీ మొత్తంలో ఎగుమతి చేసుకున్నారు. అయితే తాజాగా హైడ్రోక్సీక్లోరోక్విన్  ముందు కరోనా వైరస్ ను  సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో పూర్తి స్థాయిలో నిజం లేదని వెల్లడించారు. ప్రామాణిక వైద్య చికిత్సతో పోలిస్తే మలేరియా వ్యాధికి సంబంధించిన మందు కరోనా పై ప్రభావం పరిమితంగానే  ఉంది అంటూ ఓ అధ్యయనంలో వెల్లడైంది. హైడ్రోక్సీక్లోరోక్విన్ పై  అమెరికన్ సీనియర్ సైనిక సిబ్బంది పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దానిపై ప్రభుత్వం ఓ అధ్యయనం చేయగా .. ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. 

 

 

 కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి మలేరియా విరుగుడు మందు అయినా హైడ్రోక్సీక్లోరోక్విన్  మందు  ద్వారా 28 శాతం మరణాలు సంభవిస్తున్నాయని... అదే ఆంటీబయాటిక్ అజిత్రోమైసిన్ తో కలిపి ఈ మందులు తీసుకోవడం ద్వారా కేవలం 22 శాతం మాత్రమే మరణాల రేటును నమోదు అయింది అంటూ ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే మలేరియా వ్యాధికి సంబంధించిన మందు ఆంటీబయాటిక్ కాంబినేషన్ కలిపి కరోనా పై  సమర్థవంతంగా పోరాడుతుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త దిధిర్ రౌల్డ్  వెల్లడించారు . అయితే ఈ ప్రామాణిక వైద్యం పొందిన రోగుల్లో మరణాల రేటు 11 శాతం గా ఉండడం గమనార్హం . 

 

 

 తాజాగా  ఈ అధ్యయనాన్ని రాండమ్ గా  చేపట్టకుండా ఇప్పటికీ ముగిసిన కేసులో రికార్డులను పరిశీలించడం ద్వారా నిర్వహించడం జరిగిందని.. ఈ తాజా సర్వే కి  ఈ మేరకు మాత్రమే పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా పురుషులు ఉన్నారని..వారు  65 సంవత్సరాలు దాటినవారు ఉండటంతో మధుమేహం రక్త పోటు గుండె జబ్బులు లాంటి వాటితో బాధపడుతున్న వారు కరోనా  బారినపడినప్పుడు  వారికి ఈ ప్రామాణిక వైద్యం అంతగా స్పందించడం లేదు అంటూ చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి హైడ్రోక్సీక్లోరోక్విన్  ఇవ్వడం ప్రమాదకరమని అంతకుముందు కొన్ని అధ్యయనాల్లో కూడా వెల్లడించారు నిపుణులు .  కరోనా  వైద్య చికిత్సలో భాగంగా రాండమ్ పద్ధతులు కరోనా వైరస్ రోగులకు క్లినికల్ ట్రయల్స్ కూడా వైద్యుల పర్యవేక్షణలో సాగితేనే మంచి వస్తాయని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: