క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌క‌పోతుండ‌టంతో అనుమానితుల క్వారంటైన్ గ‌డువును 14రోజుల నుంచి 28రోజులకు పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క  నిర్ణ‌యం తీసుకుంది. కొంత మందికి కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు 28 రోజుల వరకు బయటపడడం లేదని గ్రహించిన అధికారులు ప్ర‌భుత్వానికి ఇదే విష‌యాన్ని నివేదించారు. దీంతో వైద్య నిపుణులు సూచ‌న మేర‌కు  హోం క్వారంటైన్ గడువును పెంచాలని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించ‌నుంది. 


మ‌రోవైపు రెండు తెలుగు రాష్ట్రాల‌ను సైలెంట్ మోడ్‌లో క‌రోనా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. కరోనా వైరస్‌ ఎలా సోకిందో తేలని పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో 52 ఉన్నాయని ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నబ‌డిన‌వారిలోనూ క‌రోనా పాజిటివ్ వ‌స్తుండ‌టం జ‌నాల్లో భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో న‌మోదైన ఎనిమిది కేసుల్లో ఆరు ఒకే ఇంటి నుంచి ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఆ ఇంటి ప‌నిమ‌నిషికి 21రోజుల త‌ర్వాత ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అల‌ర్ట్ అయ్యారు. క‌రోనా ఏరూపంలో వ‌చ్చి కాటేస్తుందోన‌ని జ‌నాలు బెంబేలెత్తిపోతున్నారు. 


మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదు అవుతుండగా, సూర్యాపేట ఆ తర్వాతి స్థానంలో ఉంది. భార‌త్‌లో కోవిడ్ మ‌ర‌ణాలు 652కు చేరుకున్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు  20471 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 3960 మంది డిశ్చార్జి కాగా.. 652 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్రలో కోవిడ్‌-19ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే వేలాదిమందికి సోకిన ఈ వ్యాధి వంద‌లాదిమందిని పొట్ట‌నబెట్టుకుంది. దేశంలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోదైన రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ఉంది. అంతేకాదు దేశం మొత్తం న‌మోదైన కేసుల్లో పావువంతు ఇక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: