కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఏపీ మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి అరికట్టడానికి చర్యలు తీసుకుంటూనే, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు వంతెనలు, సిమెంట్ రోడ్లు, బోరు బావులు లాంటివి ప్రారంభిస్తున్నారు.

 

అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెద్ద ఆర్భాటంగా చేస్తూ, లాక్ డౌన్ రూల్స్ పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా ఓ బోరుబావి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వస్తున్న రోజాపై అక్కడి ఊరి ప్రజలు వరుసగా నిల్చుని, పూల వర్షం కురిపించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు టీడీపీ నేతలు కూడా స్పందిస్తూ...ఇలాంటి టైంలో ఇంత ఆర్భాటం చేయడమేంటి, కనీసం జాగ్రత్తలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం తగదంటూ విమర్సలు చేశారు.

 

ఈ విమర్శలకు రోజా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కనీసం తాగునీరు కుడా ఇవ్వలేకపోయారని, తాము ఆ పని చేస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఖాళీగా తిని కూర్చోండని, అలా కాకుండా ట్రోల్ చేస్తే తాటతీస్తానని టీడీపీ కార్యకర్తలని హెచ్చరించారు. రోజా కామెంట్స్ కు టీడీపీ కార్యకర్తలు స్పందిస్తూ...చేసిందే తప్పు అనుకుంటే మళ్ళీ దానిని కవర్ చేసుకోవడానికి తిరిగి విమర్సలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

 

అయిన రోజా ఒక పాయింట్ మరిచిపోయారు అనుకుంటా అని చెబుతూ...ఒకవేళ గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం బోరు బావి వేయించకపోయినా, మీరు ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి అప్పుడు మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. బోరు బావి వేసే డబ్బులు కూడా మీ దగ్గర లేవంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: