ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి జగన్ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే రోజుకూ టెస్టుల సంఖ్యని కూడా పెంచింది. అయినా సరే సామాజిక వ్యాప్తితో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైపోతున్నాయి.

 

మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అయితే ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన  ప్రతిపక్షం, ఎక్కువ విమర్సలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు రోజు అదే పనిలో ఉంటున్నారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ మీడియా సమావేశం పెట్టడం, జగన్ ప్రభుత్వంపై  విమర్శలు చేయడం చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్ ఛార్జ్ భూమా అఖిలప్రియ, జగన్ ప్రభుత్వంపై ఒంటికాలి మీద వెళుతున్నారు. మీడియా ముందుకు రావడం, కరోనా వ్యాప్తి అరికట్టడంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందటూ విమర్సలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులని కూడా తాము ఇచ్చినట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని, ఇక కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ విమర్సల వర్షం కురిపిస్తున్నారు.

 

అయితే కర్నూలు జిల్లాలో మిగతా టీడీపీ నేతలు ఎవరు మాట్లాడటం లేదు గానీ, అఖిలప్రియ మాత్రం లీడ్ తీసుకుని మరీ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక చంద్రబాబు డైరక్షన్ లొనే అఖిలప్రియ ముందుకెళుతున్నారని తెలుస్తోంది. ఆయన రోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గైడెన్స్ ఇస్తున్నట్లు సమాచారం.

 

అసలు కర్నూలులో కె ఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నాసరే అఖిలప్రియనే జగన్ పై విమర్సలు చేయడంలో ముందుంటున్నారు. సీనియర్ నేతలే సైలెంట్ గా ఉంటే, అఖిల లీడ్ తీసుకుని మరీ హడావిడి చేసేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: