దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ కేవలం ఇంటికే పరిమితమైతే కరోనా  వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు వైద్యులు . కొంచెం ఎక్కడ చిన్న చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా కరోనా  వైరస్  రోగులకు   చికిత్స అందిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం డాక్టర్లకు దండం పెట్టి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఏకంగా వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఘటన అయితే ప్రస్తుతం నీచ సంస్కృతికి నిలువుటద్దం గా మారిపోయింది. ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకున్న డాక్టర్లు చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా దాడికి పాల్పడ్డారు. 

 తమిళనాడులోని చెన్నైలో డాక్టర్ సైమన్  హెర్క్యులస్ అనే వైద్యుడు కరోనా  వైరస్ పేషెంట్లకు చికిత్స చేస్తూ ఉండేవాడు. అయితే సదరు వైద్యులు తాజాగా మరణించాడు. ఈ క్రమంలోనే అతని అంత్యక్రియలు జరిపనివ్వకుండా స్థానిక ప్రజలందరు డాక్టర్లపై దాడులకు పాల్పడ్డారు. కరోనా వైరస్  బారి నుంచి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సదరు వైద్యుడికి చివరికి అంత్యక్రియలకు కూడా నోచుకోని పరిస్థితి వచ్చింది. చివరికి అతని స్నేహితుడు ప్రదీప్ కుమార్ అనే డాక్టర్  ఒక్కడే గొయ్యి తీసి  పూడ్చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎన్నో మీడియా సంస్థలు ఆ డాక్టర్ కరోనా   పేషెంట్లకు చికిత్స అందిస్తూ ఆ డాక్టర్ కూడా కరోనా  వైరస్ బారిన పడి మరణించాడు అని ఎన్నో బ్రేకింగ్ వేసుకున్నాయి. 

 కానీ అతను చనిపోవడానికి ప్రపంచమహమ్మరి  వైరస్ కారణం కాదు అని చనిపోయిన డాక్టర్ సైమన్ స్నేహితుడు ప్రదీప్ కుమార్ క్లారిటీ ఇస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాణాలను పణంగా పెట్టి మేము పని చేస్తుంటే కనీసం తమకు చనిపోయిన కూడా గౌరవం ఇవ్వడం లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు డాక్టర్ ప్రదీప్ కుమార్. చనిపోయిన తన స్నేహితులు సైమన్ హెర్క్యూలస్  కరోనా  వైరస్ కారణంగా చనిపోలేదని  డెంగ్యూ వ్యాధి సోకడం ద్వారా చనిపోయాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు డాక్టర్ ప్రదీప్ కుమార్. కానీ అక్కడి ప్రజలు మాత్రం దారుణంగా ప్రవర్తించారని మీడియా సంస్థలు కూడా కరోనా  వైరస్ కారణంగా చనిపోయాడు అంటూ అసలు విషయం తెలుసుకోకుండానే బ్రేకింగ్ లు వేశారు  అంటూ కన్నీరు మున్నీరయ్యారు డాక్టర్ ప్రదీప్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: