అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు  విమర్శలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే అధికారపార్టీ ఏం చేసినా దానిని తప్పు పడుతూ ఉంటుంది ప్రతిపక్ష పార్టీ. అయితే ప్రస్తుతం కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ  పరిస్థితి అయితే వినేవాడు ఉంటే చెప్పేవాడు కరువ అన్నట్లుగా మారిపోయింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాజకీయాలు ఇంత దరిద్రంగా తయారయ్యాయో  అర్థమవుతుంది. నిన్నటి వరకు రాహుల్ గాంధీ ఇండియాలో శానిటైసర్లు  మాస్కులు అంతేకాకుండా వైద్యులకు కిట్లు లేవని ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటిని ప్రిపేర్ చేయడం లో సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదు అంటూ విమర్శలు చేశారు. 

 


 ఇక తాజాగా మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ. దేశంలో చాలా మంది అన్నం లేక ఆకలితో అలమటిస్తుంటే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యంతో శానిటైసర్  తయారు చేయడానికి నిర్ణయించింది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఓ  వైపు రాహుల్ గాంధీ శానిటైసార్లు  మాస్కులు తదితర కిట్లు కావాలి అని అంటారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇవన్నీ వద్దు అని అంటాడు.. ఇదేం విచిత్రం అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం దేశంలో ఎఫ్సీఐ గోడం లో 59.84 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు  ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ల బియ్యం... 27.92 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి. అంటే నిర్దేశించినటువంటి  ఆహార నిల్వలు కంటే ఏప్రిల్ 1 నాటికి21 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

 అయితే ప్రస్తుతం నిల్వ ఉన్న 21 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసే అవకాశం లేదు. కొత్తగా మళ్ళీ ధాన్యం   వస్తున్న నేపథ్యంలో గోదాములలో ఉన్న  ధాన్యం తో పాటు కొత్త ధాన్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో విదేశాల నుంచి శానిటైసార్లు  దిగుమతి చేసుకోవడం కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న 21 మిలియన్ టన్నుల ధాన్యం తో శానిటైసార్లు  తయారు చేసి ఖర్చును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ బియ్యాన్ని ఇతనాల్  గా మార్చి శానిటైసర్లను  తయారు చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గుతుందని తెలిపింది. అలాగే బియ్యం ద్వారా తయారు చేసిన ఇథనాల్  పెట్రోల్ లో కూడా కలిపి ఉపయోగిస్తామని  మన కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ పేదలు ఆకలితో అలమటిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించటం  విడ్డూరమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: