ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన అధికారుల్లో అవకతవకలకు పాల్పడ్డారు అన్న అనుమానం ఉన్న అందరిపై ప్రత్యేకమైన విచారణ జరిపి సస్పెండ్ చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక దీక్షగా పెట్టుకున్న విషయం తెలిసిందే. టిడిపి హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కూడా అలాగే ప్రభుత్వ ఆగ్రహానికి గురయి సస్పెండ్ అయ్యాడు.

 

అప్పట్లో కృష్ణకుమార్ టీడీపి ప్రభుత్వం హయంలో ఈడీబీ లో పలు అవకతవకలు జరిపాడంటూ జగన్ ప్రభుత్వం అతనిపై వేటు వేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆశ్రయించారు. అతని వాదనను పరిశీలించిన క్యాట్.. కిషోర్ ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన తర్వాత నిదానంగా అతను సస్పెన్షన్ రద్దు చేసింది. కృష్ణకిషోర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది.

 

అంతేకాకుండా అతనికి అత్యంత కీలకమైన ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పదవిని కట్టబెట్టడం విశేషం. అయితే ఇన్ని రోజులు కృష్ణ కిషోర్ ను రిలీవ్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసినా చివరికి అతనికి పదోన్నతి లభించడం గమనార్హం. కృష్ణ కిశోర్‌పై ఉన్న కేసుల దర్యాప్తు కొనసాగించవచ్చునని క్యాట్ గతంలోనే స్పష్టం చేసింది.దీంతో కేసుల దర్యాప్తు కొనసాగనుంది. కృష్ణ కిశోర్ సస్పెన్షన్ వ్యవహారం ఏపీలో రాజకీయంగానూ దుమారం లేపింది. చంద్రబాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే ఆయనపై అభియోగాలు మోపారని టీడీపీ ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: