ఈ ప్రపంచానికి ఏమైంది.. ఒక వైపు కరోనా మరణాలు.. మరోవైపు చిత్రవిచిత్రమైన సంఘటనలు.. అసలే భయంతో ప్రజలు బిక్కచచ్చిపోతుంటే.. వీటికితోడుగా భయపెట్టేలాంటి వార్తలు.. ఇవన్ని చదివిన వారి మెదడు ఎన్ని ఆలోచనలు చేస్తూ పిచ్చెక్కిపోతుందో.. కొందరైతే భయంతో ఇంకేం బ్రతుకుతామురా బాబు.. ఈ బ్రతికన్ని రోజులైన సుఖపడుదామని డిసైడ్ అయ్యారట.. అంతలా ప్రపంచాన్ని ఈ మధ్యకాలంలో కరోనా మార్చేసింది.. ఇకపోతే మనుషులకు రోగాలు వస్తే నోరుంది కాబట్టి తన భాధను ఇతరులకు గానీ వైద్యులకు గానీ వెంటనే తెలియచేసి సరైన చికిత్సను తీసుకుంటాడు.. అదే జంతువులకు, పశువులకు ఏదైనా వ్యాధి అంటితే పాపం అవి నోటితో చెప్పలేవు..

 

 

ఒక వేళ మనుషులు.. పశువుల డాక్టర్లు ఓపిక చేసుకుని వాటిపట్ల శ్రద్దవహిస్తేనే  కోలుకుంటాయి.. ఇకపోతే ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు భయాందోనకు గురవుతుంటే. మరోవైపు మూగ జీవాలు అంతుపట్టని రోగాలతో మృత్యువాత పడుతున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో కోతులు మరణించడం సంచలనం రేపింది.కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో సుమారు 20కి పైగా కోతులు మరణించాయి. అదీగాక కాకులు మరణించిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మరోచోట అకస్మాత్తుగా ఆవుల కళ్లల్లో నుంచి రక్తం కారడమే కాకుండా వాటి శరీరంపై ఎర్రటి మచ్చలు కూడా రావడంతో ఆ గ్రామ ప్రజల్లో టెన్షన్ మొదలైంది.

 

 

అసలే జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇలా జరగడంతో.. కొందరు చాదస్తం ఉన్న వారైతే ఏవేవో మాటలు చెబుతున్నారు.. ఇక చివరకు వైద్యులు వచ్చి అసలు ఆవులకు అలా ఎందుకు జరిగిందనే తేల్చారు. అసలు విషయం తెలవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే..

 

 

కొండపల్లి గ్రామంలో ఆవుల కళ్లల్లో నుంచి రక్తం రావడం గమనించారు గ్రామస్థులు. ఆవుల శరీరంపై ఎర్రటి మచ్చలున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 70 ఆవుల్లో ఇలాంటి పరిస్థితి ఉంది.. ఇక పశు వైద్యులు అక్కడికి వచ్చి.. ఆవులను పరిశీలించి వాటికి పొంగు వ్యాధి ఉందని నిర్ధారించారు. పొంగు అంటు వ్యాధి అని, ఒక ఆవు నుంచి మరొక ఆవుకు వస్తుందని ఒక వారం రోజుల పాటు ఆవులకు చికిత్స అందిస్తే తగ్గిపోతుందని తెలిపారు.. ఇక అందరూ భయ పడుతున్నట్లుగా.. ఆవుల నుంచి కరోనా వ్యాధి రాదని  పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: