లాక్‌డౌన్ అమలుతో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేమా..?!  త‌లుపులు మూసుకున్నంత మాత్ర‌నా క‌రోనా నియంత్ర‌ణ సాధ్యం కాదా..?! అంటే ఫించ్ సోల్యూష‌న్స్ సంస్థ అవున‌నే అంటోంది. లాక్‌డౌన్ అమ‌లు దిగ్విజ‌యంగా భార‌త్‌లో అమ‌ల‌వుతోంది. ఈ అమూల్య‌మైన స‌మ‌యాన్ని వ్యాధిని నియంత్ర‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయాల్సిన స్థాయిలో ప‌నులు చేయ‌డం లేద‌న్న‌ది ఈ స‌ర్వే సంస్థ ఆరోప‌ణ‌. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా నెల‌కొన్న క‌రోనా పరిస్థితులు, ఆర్థిక‌, సామాజిక స్థితిగ‌తుల‌పై దీర్ఘ విశ్లేష‌ణ‌లు చేస్తూ ఒక స‌ర్వే నిర్వ‌హించింది. మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ.. కరోనా వైరస్‌ కేసుల ఉధృతి తగ్గకపోవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అభిప్రాయపడింది.


ప్రభుత్వం నెమ్మదిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆర్థిక సంక్షోభం మరింత ఎక్కువ కావొచ్చన్న ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆర్థికంగా కూడా భార‌త్ మ‌రింత ప‌త‌న‌మ‌వుతుంద‌ని చెప్పింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి 1.8 శాతానికి మించి వృద్ధి ఉండ‌బోద‌ని అంచ‌నా వేసింది.  అంతకు ముందు జీడీపీ వృద్ధి 4.6 శాతంగా ఉండొచ్చని సంస్థ అంచనా వేయడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు దిగజారుతున్నాయని, ప్రైవేట్‌ వ్యయాలు, పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని  తెలిపింది. మార్చి చివరకు 700 కేసులు ఉండగా.. కేవలం మూడు వారాల్లోనే దేశంలో కరోనా కేసులు 20,000 దాటాడాన్ని డేంజ‌ర్ జోన్లోకి భార‌త్ వెళ్లిపోయింద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని తేల్చింది. 


క‌రోనా అనుమానాల‌తో క్వారంటైన్‌కు త‌ర‌లుతున్న‌వారి సంఖ్య కూడా రోజూ వేల సంఖ్య‌లో ఉండ‌టాన్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతోంది. యని గుర్తు చేసింది. అయితే భారత్‌ జనాభాను దృష్టి పెట్టుకుంటే.. ఇది క్లిష్టసమయమని చెప్పలేమని తెలిపింది. భారత్‌లో ప్రతి పది లక్షల మందిలో 257 మందికే కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు జరిగాయని వెల్లడించింది. ఇదిలా ఉండ‌గా బుధ‌వారం కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా కేసుల వివ‌రాల ప్ర‌కారం...పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటేసింది. ఇక మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. 5000వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: