అవును.. ఆ చైనా పప్పులు జగన్ సర్కారు ముందు ఉడకలేదట. కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది కదా. మరి ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మన దేశంలో తగినన్ని అందుబాటులో లేవు. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి సున్నం పెడదామని కొందరు వ్యక్తులు ప్రయత్నించారట.

 

 

పనికిమాలిన చైనా కిట్లను ఏపీ సర్కారుకు అంటకట్టే ప్రయత్నం జరిగిందట. చైనా కిట్లు ఇప్పిస్తామంటూ కొందరు ఏపీ సర్కారులోని అధికారులను ఆశ్రయించారట. అయితే అధికారులు మాత్రం చైనా మాల్ అంటే నమ్మలేమని ఆ ఆఫర్ ను తిరస్కరించారట. ఆ తర్వాత కొరియా నుంచి నాణ్యమైన కిట్లు తెప్పించారట. అయితే చైనా కిట్లను తెప్పించుకున్న రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో టెస్టుల ఫలితాలు దారుణంగా వచ్చాయట.

 

 

దీంతో ఈ విషయాన్ని ఏపీ అధికారులు సీఎం జగన్ కు వివరించారు.తమ వద్దకు చైనా కిట్ల ప్రతిపాదన రాగా వాటిని తాము ఒప్పుకోలేదని, కొరియా నుంచి నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించామని అధికారులు పేర్కొన్నారు. కొరియా నుంచి అమెరికాకు వెళ్లాల్సిన కిట్లను చార్టర్‌ విమానం ద్వారా తెప్పించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికి 5 నుంచి 6 వేల శాంపిళ్లను పరిశీలించామని అన్నారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

 

 

అంటే చైనా పప్పులు జగన్ సర్కారు ముందు ఉడకలేదన్నమాట. అంతే కాదు.. కరోనా రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం చేస్తున్నారట ఏపీ అధికారులు. కరోనా రోగులకు పల్స్‌ ఆక్సీ మీటర్లు పెడుతున్నామని అన్నారు. మరిన్ని పల్స్‌ఆక్సీ మీటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రతి 6 గంటలకోసారి ఆక్సిజన్‌ లెవల్‌ చెక్‌ చేస్తున్నామని సీఎంకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: