నిన్న మనదేశంలో కేవలం ఒక్కరోజులోనే 1486 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా కేసులు 20 వేలకు దాటిపోయాయి. ఈ పరిస్థితులలో దేశంలో లాక్ డౌన్ మే నెలాఖరు వరకు కొనసాగుతుంది అని అంటున్నారు. 


కరోనా సమస్యతో మధ్య ప్రదేశ్ లో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలు చేయడానికి అతడి కొడుకు భార్య కూడ తిరస్కరించిన వింత పరిస్థితులు ఈ దేశంలో రాజ్యమేలుతున్న పరిస్థితులలో కరోనా పై పోరుకు భారత ప్రభుత్వం త్వరలో ఒక ‘చేతి పట్టీ’ ని ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆరోగ్య సేతు’ యాప్ కు అనుసంధానం చేస్తూ ఈ డిజిటల్ అస్త్రాన్ని సిద్ధం చేయాలని భారత ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.


మన పరిసరాలలో కరోనా రోగులు సంచరిస్తే మనకు సంకేతాలు ఇవ్వడమే కాకుండా కరోనా రోగుల ట్రాకింగ్ కు ఈ చేతి పట్టి సహకరిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించిన హార్డ్ వేర్ సాఫ్ట్ వేర్ ను ఆరోగ్యసేతు యాప్ తో అనుసంధానం చేసి రానున్న రోజులలో కరోనా పై యుద్ధానికి డిజిటల్ వార్ కు సిద్ధం అవుతోంది. 


ఈ పరిస్థితులలో పెద్ద మొత్తంలో ఈ చేతిపట్టి ల కొనుగోలకు భారత ప్రభుత్వ ఆరోగ్యశాఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చేతి పట్టిలో కరోనా రోగి కదలికలను నిక్షిప్తం చేసే అధునాతన సాంకేతికత ఉంటుంది అని అంటున్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా చైనా శాస్త్రవేత్తలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోతులు ఎలుకల పై ప్రయోగించిన తొలిదశ ప్రయోగం విజయవంతం అయినట్లు వార్తలు వస్తున్న పరిస్థితులలో కరోనా వైరస్ పుట్టిన చైనా నుండి కరోనా వ్యాక్సిన్ నిజంగా వస్తే అది ఒక అద్భుతమే అవుతుంది. మే మొదటివారానికి మన దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటిపోతాయి అని వస్తున్న అంచనాలను బట్టి మన భారత్ లో ఈ లాక్ డౌన్ ఎత్తివేయడం ఇప్పట్లో జరగకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి..     

మరింత సమాచారం తెలుసుకోండి: