రాష్ట్రంలో కరోనా వైరస్ మూలంగా అన్ని సేవలు ఆగిపోయాయి.. అన్ని సంస్దలు మూతపడగా ఉద్యోగులందరు ఇళ్లకే పరిమితమయ్యారు.. ఏ పనులు ఆగిపోయినా.. ప్రపంచం స్దంభించిపోయినా మనిషికి ఒక్క నిమిషం కరెంట్ లేకుంటే అసలు తట్టుకోలేడు.. అంతలా అలవాటు అయ్యాడు.. అందులో లాక్‌డౌన్ ఒక వైపు.. మండే ఎండలు మరోవైపు.. చల్లగా కూలర్ గానీ, ఏసీ గాని వేసుకుని ఎంజాయ్ చేస్తున్న వారికి విద్యుత్ అంతరాయం కలిగితే ఎలా ఉంటుందో ఊహించండి..

 

 

ఇంతవరకు బాగానే ఉంది.. మరి కరెంట్ ఏమి మన పెరట్లో పండే కూరగాయలు కాదుకదా.. మరి ఈ లాక్‌డౌన్ వేళల్లో ఇంటింటికి తిరిగి కరెంట్ బిల్లు కొట్టిచ్చే పరిస్దితి లేదు.. మరి బిల్లుకట్టకుండా ఉంటే మనకు కొన్ని రోజులకు విద్యుత్ సరాఫరా చేయలేని దుస్దితి కలుగుతుంది.. అందుకే అందరికి విద్యుత్ బిల్లులు కట్టమని ప్రభుత్వం చెబుతుంది.. మరి ఈ బిల్లులు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నారా.. ఇందుకోసమే దేశ రాజధాని ఢిల్లీలో ఉపయోగించిన విధంగా ఇక్కడ ఉపయోగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకు అక్కడ ఉపయోగించే టెక్నాలజీ ఏంటో తెలుసా.. ఎవరు ఇంటి మీటర్ ఫొటో వారే తీసి..ఆన్ లైన్ లో పంపితే బిల్లు పంపిస్తామని.. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది.

 

 

ఇందుకు ఢిల్లీ డిస్కంలు ఒక యాప్ ను కూడా రూపొందించాయి ఈ విధానాన్నే తెలంగాణాలో ప్రవేశపెట్టాలని తెలంగాణ డిస్కం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రయోగాత్మకంగా వాడేందుకు దీన్ని అనుమతించాలని డిస్కంలను కోరింది. ఇలాచేయడం వల్ల డబ్బులు ఆదా అవుతాయని వెల్లడిస్తోంది. ఇకపోతే వినియోగదారుడే సరిగ్గా 30 రోజులకు మీటర్ రీడింగ్ ఫొటో తీసి ఆన్ లైన్ ద్వారా పంపితే సరి..

 

 

ఇకపోతే వినియోగదారులు దీనికి సంబంధించిన యాప్ ను  తమ స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. కరెంటు కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేయాలి. మీటర్ రీడింగ్ నెలకొసారి తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ ద్వారా డిస్కంకు చేరి ఎంత బిల్లు వచ్చిందో తెలిసిపోతుంది. ఆన్ లైన్ ద్వారానే డబ్బులు కూడా చెల్లించవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి: