ఈ ప్రపంచంలో కరోనా వైరస్ గురించి తెలియని వారు ఎవరు అయినా ఉంటారా...? వంద మందిలో 99 మందికి దాని గురించి కనీస అవగాహన ఉంది. అవగాహన లేకపోయినా ఆసలు అది ఏంటీ అనే స్పష్టత ఉంది. కాని ఒక జంటకు మాత్రం అది ఏంటో తెలియదు. అవును అసలు దాని గురించి వాళ్ళకు ఏ సమాచారం తెలియదు... అసలు అది ఒకటి ఉంది అనే విషయం కూడా వాళ్లకు ఎవరూ చెప్పలేదు. 

 

చెప్పడం ఏంటీ... ఇంత జరుగుతుంటే అంటారా...? పాపం వాళ్ళు భూమి మీద లేరులే సముద్రంలో తిరుగుతున్నారు. యూకేలోని మాంచెస్టర్‌కి చెందిర ఎలెనా మణిశెట్టి, ర్యాన్ ఒస్బోర్న్ 2017లో తమ ఉద్యోగాలకి రిజైన్ చేసి బోట్‌ని కొనుగోలు చేసి ప్రపంచం మొత్తం తిరగడం పనిగా పెట్టుకున్నారు. తమకు బాడ్ న్యూస్ ఏ ఒక్కటి చెప్పవద్దు అని నిబంధన పెట్టారు వాళ్ళు. దీనితో ఇంట్లో వాళ్ళు మాట్లాడినా సరే కరోనా విషయం చెప్పలేదు. 

 

సోషల్ మీడియాతో పాటు అన్నీ కూడా ఆపేశారు వాళ్ళు. దీనితో కరోనా చేస్తున్న నాశనం, లాక్ డౌన్, సరిహద్దులను మూసి వేయడం ఏ ఒక్కటి కూడా వాళ్లకు తెలియదు. ఈ జంట గత నెలలో కానరీ దీవుల నుండి కరేబియన్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, కరోనా విలయతాండవం మొదలయింది. కరేబీయన్ దీవులకి చేరుకున్న ఈ జంట దాని సరిహద్దు మూసి ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. 

 

దీనితో వెనక్కు తిరిగిన ఆ జంట తమ నౌకను గ్రెనడాకు మళ్లించారు, అక్కడ వారు చివరకు ఇంటర్నెట్ కనెక్షన్ రావడంతో వాళ్లకు అసలు విషయం తెలిసింది. వెంటనే సెయింట్ విన్సెంట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పినా వీళ్ళను సముద్రంలోనే 25 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఎం చెయ్యాలో తెలియక వారు సముద్రంలోనే ఉండిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: