‘కరోనా’ నియంత్రణా చర్యలపై చర్చించామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గం సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కరోనా‘ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందిస్తామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రాణాలను అడ్డుపెట్టి శ్రమిస్తున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, 120 ఏళ్ల నాటి ఎపిడెమిక్ యాక్ట్ కు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన కేంద్రం అత్యవసర ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకు వచ్చిందని అన్నారు. 

 

ఈ చట్ట సవరణలో భాగంగా వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి, వెంటనే జైలుకు తరలిస్తారు.     తాజాగా ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించే ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్ 2020 కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్ కూడా‌ విడుదల చేశారు.  తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టయింది.

 

వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.  ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 సవరణ చేశారు.. దీనికి ప్రకారం మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, అలాగే రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది.  అయితే ఈ ఆర్డినెన్స్ లాక్ డౌన్ వరకేనా తర్వాత కూడా అమల్లో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి  ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: