లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది..

 

 

 

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు బాధలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వారిలో ముందువరసలో నిలుస్తున్నారు వలసకార్మికులు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇస్తున్న ఆర్థికసాయం లేదా సహాయం అందరికీ అందడం లేదనే వాదన కూడా ఉంది. ఇలాంటి వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. 

 

 

 

సెక్స్ వర్కర్ల సంపాదన కూడా తగ్గిపోయింది. కొందరికైతే అసలు సంపాదనే లేదు. దీంతో వారి కష్టాలు రెట్టింపు అయ్యాయి. తినేందుకు తిండిలేక, నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక ఒక్క పూటనే కడుపు నింపుకుని మిగతా రెండు పూట్ల పస్తులు పడుకుంటున్నారు. సెక్స్ వర్కర్లలో చాలామందికి భర్త ఉండడు. వారు నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడి తమ పిల్లలను పోషించుకుంటుంటారు

 

 

 

ఈ నేపథ్యంలో సెక్స్ వర్కర్లు ఏపీ సీఎం జగన్ కు ఓ లేక రాసారు.. రేషన్, మరియు నగదు సహాయం చేయాలని సీఎం జగన్‌ను కోరారు. సెక్స్ వర్కర్ల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విముక్తి ఫోరం అనే సంస్థ సెక్స్ వర్కర్ల ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి లేఖ ద్వారా తీసుకొచ్చింది. వారికి వెంటనే రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు నిత్యావసర వస్తువులు అందజేయాలని లేఖలో కోరాయి. ఆంధ్రప్రదేశ్‌లో 30 సెక్స్ వర్కర్ల ప్రాంతాలు అంటే పాక్షిక రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక రాష్ట్రంలో 1.20 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు విముక్తి ఫోరం ప్రతినిధులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: