విశాఖ జిల్లాలోని  కరోనా అనుమానితుల కోసం జల్లెడ పడుతున్నారు. జీవీఎంసీ పరిధిలో ప్రత్యేక బృందాలు నాలుగోవిడత సర్వే పకడ్బంధీగా నిర్వహిస్తున్నాయి. ప్రజల అనారోగ్య లక్షణాలకు సంబంధించిన సమగ్ర సమాచార సేకరణ జరుగుతోంది.

 

కరోనాను కట్టడి చేసే క్రమంలో విశాఖలో నాలుగో విడత సర్వే సమగ్రంగా జరుగుతోంది. జీవీఎంసీ పరిధిలోని 98వార్డుల్లో ప్రత్యేక బృందాలు వివరాలను సేకరిస్తున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ తర్వా త వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పూర్తి సమాచారం రాబడుతున్నారు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అనిమానితులను నిర్ధారించుకు
నేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

ఇప్పటి వరకు రెడ్ జోన్ల పరిధిలో మూడు సర్వేలు జరిగాయి. వాటిలో అనారోగ్య సమస్యలను గుర్తించగా...ఇప్పుడు శాంపిల్ కలెక్షన్ జరుగుతుంది. ప్రస్తుత సర్వేలో వాలంటీర్లతో పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్తున్నారు. వివరాలు సేకరించిన తర్వాత ప్రతీ ఇంటికి సర్వే పూర్తి చేసినట్టు స్టిక్కర్ అతికిస్తున్నారు. గ్రేటర్ లోని ఆరు జోన్లు,...అనకాపల్లి,భీమిలి ప్రాంతాల్లో ఒక ప్రణాళిక రూపొందించుకుని బృందాలు పర్యటిస్తున్నాయి. 

 

గ్రేటర్ నగరంలోని సుమారు 5లక్షల ఇళ్లను సర్వే చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఈ సర్వే కోసం సుమారు పదివేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా అనుమానితులను గుర్తించడమే నాలుగోవిడత లక్ష్యం.

 

రెడ్ జోన్లలో మరింత లోతుగా వివరాలు సేకరణ జరుగుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో రాబోయే పది-పదిహేను రోజులు కీలకమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఇంటింటి సర్వే ద్వారా లభించిన డేటాను యాప్ లో నమోదు చేస్తున్నారు. ఆ విధంగా క్షేత్రస్థాయిలో వస్తున్న సమాచారం జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి చేరుతుంది. ఈనెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మరోవైపు, కరోనా తగ్గిన వారు.. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ ముగించుకున్న వారిని ప్రత్యేకంగా ట్రాకింగ్ చేస్తున్నారు. సర్వేలో అనుమానితులు బయటపడితే , వారిని చికిత్సకు తరలించడం ద్వారా వ్యాప్తిని కట్టడి చేయాలనేది అధికారుల ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: