కరోనా విపత్తు సమయంలోనూ ఎప్పటి మాములుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ, తన పరపతిని తానే  తగ్గించుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏదో ఒక రకంగా రాజకీయగా పై చేయి సాధించాలనే తపనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ విపత్కర సమయంలోనూ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలబడుతూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాబు యధావిధిగా రాజకీయాలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నివిమర్శలు వస్తున్న లెక్కచేయకుండా, చంద్రబాబు ఆ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 


 ఈ విపత్తు సమయంలో బాబు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, బాబు కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ విజయ సాయి రెడ్డి తన దూకుడుని ఎక్కడా  తగ్గించడం లేదు. ట్విట్టర్ వేదికగా తమ రాజకీయ ప్రత్యర్థులపై విజయసాయి రెడ్డి తరచుగా విమర్శలు చేస్తూనే, ప్రభుత్వ నిర్ణయాలు ఏంటో స్పష్టంగా చెబుతూనే వస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్లో ఈ విధంగా ప్రస్తావించారు. " బాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషిని పంపించి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టు కెళ్లి జీవోను కొట్టి వేయిస్తాడు. గ్లాసు పార్టీపై ఎంపిగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటిషన్ వేస్తాడు. 

 


ప్రజలపై ఎందుకు ఇంత ద్వేషం ? వీళ్ళ వెనుక ఉన్నది ఎవరు" అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ప్రశ్నించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్టులో కరోనా నియంత్రణ, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తలు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. కొరియా కిట్లు వచ్చాక వ్యాధి కట్టడి ఇంకా తేలిక అవుతుందని, ప్రజలు నిశ్చంతగా ఉంటే ఏపీ సీఎం జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని బాబు ఏడుపు  అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: