ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ నడుస్తోంది. కరోనా ప్రభావంతో అన్ని ఆఫీసులు మూతపడడం, లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు అవుతుండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు రాజకీయాలకు  కూడా పాకింది. కరోనా కారణంగా రాజకీయ నేతలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. సొంతంగా ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారు. అయితే విపత్తులోనూ ప్రచారాన్ని వెదుక్కునే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు తమ పార్టీ నేతలకు ఈ కరోనా ను ఎలా ఉపయోగించుకోవాలో, అది కూడా ఇంటి నుంచే దీనిని ఏ విధంగా వాడుకోవాలో సరికొత్త ప్లాన్ వేశారు. సాధారణంగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేయాలంటే చాలా హడావుడి ఉంటుంది.  అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇంటి నుంచే నిరసన దీక్షలు చేసే విధంగా చంద్రబాబు కొత్త ఆలోచనకు తెరతీశారు. 

 

IHG's loss in ...

కరోనా బాధితులకు వైసీపీ ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించడం లేదని ఆరోపిస్తూ టిడిపి నాయకులు అంతా తమ ఇళ్లలోనే నిరసన దీక్షలు చేపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగానే విశాఖ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ జగదీశ్వరరావు తన ఇంటి నుంచే దీక్ష చేపట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసి బాగానే ప్రచారం పొందారు. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా ఇదే విధంగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ, తన ఇంట్లోనే భోజనం మానేసి ఒకరోజు దీక్ష చేపట్టినట్లు ఆయన మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 

 

ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ఇదే విధమైన నిరసన దీక్షలు చేపడుతూ, ఈ నిరసన దీక్షలు తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది టీడీపీ. పైగా దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. ఇంట్లో నుంచి కాలు కదపకుండా విపరీతమైన ప్రచారం వస్తుండడంతో నాయకులు కూడా వర్క్ ఫ్రం హోమ్ పాలిటిక్స్ కి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కీలక నాయకులు అందరికీ తరచుగా ఫోన్లో చేస్తూ ఈ నిరసన దీక్షలు ఇలాగే కొనసాగించాలంటూ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్లోనే వారికి అన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: