గిల్లి గిల్లించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయాలు చేసేందుకు, మాట్లాడేందుకు, సమయం సందర్భం అనేది ఉంటుంది. అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు గా వ్యవహరిస్తే ఆ తర్వాత ఏ విధంగా అబాసుపాలు అవుతారో కన్నా లక్ష్మీనారాయణ ఉదంతం చూస్తే బాగా అర్థమవుతుంది. వైసిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా కన్నా లక్ష్మీనారాయణ రెండు మూడు రోజులుగా అదేపనిగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కరోనా కిట్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వైసిపి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తోంది. రోజురోజుకు ఈ వ్యవహారం ముదిరిపోతుండడంతో పాటు, దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కునే అవకాశం ఉండడంతో బిజెపి అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. తాజాగా ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగానే తలంటినట్టు సమాచారం. 

 

IHG


కర్ణాటక ప్రభుత్వం ఏపీ కంటే ఎక్కువ ధర చెల్లించి కరోనా కిట్లను కొనుగోలు చేసిన అంశాన్ని వైసీపీ ప్రస్తావించడంతో, బీజేపీ కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయింది. పరిస్థితి చేయి దాటి పోయే విధంగా తయారవ్వడం తో రంగంలోకి దిగిన జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బిజెపి నాయకులను ఉద్దేశించి తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. దేశమంతా కరోనా విపత్తును ఎదుర్కునే ఆందోళనలో ఉంటే..  మీకు రాజకీయ కావాల్సి వచ్చిందా..?  ఇది అసలు రాజకీయాలకు సరైన  సమయమా  అంటూ ఆయన ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మీరు ఇకపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే కుదరదు అని మీరు ఏ ఆరోపణలు చేయాలన్నా, దానికి సరైన ఆధారాలు కేంద్ర నాయకత్వం అనుమతి తప్పనిసరిగా కావాలని,జాతీయ, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు ఒకే విధంగా ఉండాలని, టీడీపీకి వైసీపీకి సమానదూరం పాటించాలని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది.

 

IHG
 ఇంత హడావుడిగా బిజెపి అగ్రనేతలు రంగంలోకి దిగి కన్నాకు క్లాసు పీకడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నలలో కన్నా లక్ష్మినారాయణ పనిచేస్తున్నారని బీజేపీ అధిష్టానం అనుమానిస్తోంది. అలాగే టీడీపీ అధినేత దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు కన్నాకు ముట్టినట్టు వైసీపీ చేసిన ఆరోపణలపైనా కేంద్రం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బిజెపి ప్రతిష్ట మరింత దిగజారకముందే అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.


 ఊహించని విధంగా అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి తనకు వార్నింగ్ ఇవ్వడంపై కన్న తీవ్ర మనస్తాపం చెందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యవహారం ముగిసిన తరువాత కన్నాను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: