కరోనా మహమ్మారి ఇపుడు దేశాన్ని చుట్టేస్తోంది. ఫస్ట్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉంటే రెండవ స్థానంలో గుజరాత్ ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు ఎనిమిది తొమ్మిది ప్లేస్ లలో ఇప్పటిదాకా  కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఉమ్మడి ఏపీగా తీసుకుంటే మాత్రం రెండు రాష్ట్రాలు కలుపుకుని రెండు వేలకు చేరువలో ఉన్నాయి. అంటే ఇది దేశంలో రెండవ ప్లేస్ గానే చెప్పుకోవాలి.

 

ఆ విధంగా కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలకు పెను ముప్పుగా మారుతోంది. ఇక ఏపీలో నాలుగు జిల్లాలు, తెలంగాణాలో హైదరాబాద్, నల్గొండ వంటి జిల్లాలు ప్రభుత్వాలకు కంటి నిండా నిద్రపోనీయడంలేదు. రోజుకు వంద లోపుగా కొత్త కేసులు నమోదు కావడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా స్టేజ్  త్రీలోకి  కొన్ని జిల్లాల్లో వెళ్ళిపోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయిట.

 

ముఖ్యంగా విజయవాడ, సూర్యాపేట్ కేసులు రైతు బజార్లకు వెళ్ళి అంటించుకుని వచ్చినవిగా భావిస్తున్నారు. అంటే ఇక్కడ కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైపోయిందని అంటున్నారు. అదే కనుక జరిగితే కరోనాను కట్టడి చేయడం సాధ్యం ఇప్పట్లో కాకపొవచ్చునని కూడా ఆందోళన పడుతున్నారు.

 

లాక్ డౌన్ ఓ వైపు ఉన్నా ఇప్పటికీ జనాలు రోడ్ల మీదకు తిరగడం జరుగుతోంది. ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నా కూడా జనాలు ఇంట్లో ఉండలేకపోతున్నారు. దానికి తోడు రద్దీగా ఉన్న చోట వెళ్లడం, గుంపులుగా గుమి గూడడం వంటివి కూడా చేస్తున్నారు. 

 

మొత్తం మీద తీసుకుంటే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనూ భయానక వాతావరణం ఏర్పడిందని భావిస్తున్నారు. మూడవ దశలోకి కరోనా అంటే కట్టడి చేయడం కష్టం. అది మిగిలిన జిల్లాలకు కూడా పాకితే ముప్పు పెద్దదే అవుతుంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలనుకుంటోందిట. చూడాలి మరి. ఈ ముప్పు ఎలా దాటేస్తామో.. ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: