ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. బయటకు వెళ్లినా కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తున్నారు. కరోనా కట్టడి కోసం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. 
 
అయితే తాజాగా బ్రిటన్ ఆస్పత్రుల్లో నర్సులు మాత్రం వరండాల్లోకి వచ్చి మరీ డ్యాన్సులు చేశారు. కొన్ని ఆస్పత్రులలో నర్సులు సామాజిక దూరం పాటిస్తూ చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి డ్యాన్స్ చేయగా మరికొందరు మాత్రం కేవలం మాస్కులు ధరించి డ్యాన్స్ చేశారు. ఆస్పత్రిలో నర్సులు రోగులను గాలొకొదిలేసి డ్యాన్సులు చేయడం... కొందరు సామాజిక దూరం పాటించకపోవడంపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. 
 
అయితే ‘ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్ట్‌’ నర్సుల్లో విధుల పట్ల కొత్త స్పూర్తిని, కొత్త ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో నింపాలనే ఉద్దేశంతో నర్సులతో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రస్ట్ ఆశయం మంచిదే అయినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇలా డ్యాన్సులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోగులను వదిలేసి వచ్చి మరీ తైతెక్కలాడాలా...? అని ప్రశ్నిస్తున్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 21,000 దాటింది. మృతుల సంఖ్య 700కు చేరింది. భారత్ లో గత 24 గంటల్లో 1409 కేసులు నమోదయ్యాయి. గత 28 రోజుల్లో 12 జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. కేంద్ర నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాలకు, పుస్తకాల దుకాణాలకు మినహాయింపు ఇచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సాలియా శ్రీవాస్తవ ఈ విషయాలను వెల్లడించారు.              

 

మరింత సమాచారం తెలుసుకోండి: