సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన యాప్స్ ఏవి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఫేస్బుక్ వాట్సప్ లు .. మిగతా దేశాల్లో ఎలా ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం వీటి వాడకం ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అందరు యూస్ చేస్తున్నది యాప్ లలో  టాప్ లో ఉన్న యాప్స్ పేస్ బుక్, వాట్సాప్ తదితర యాప్స్ ఉన్నాయి . అయితే కొత్తగా ఏదైనా యాప్ వచ్చిందంటే అది బాగా పాపులర్ కావాలి అంటే.. ముందుగా అది భారతీయులకు నచ్చాలి. ఎందుకంటే 130 కోట్ల మందికి పైగా  జనాభా ఉన్న భారతదేశంలో ఒక సారి పాపులర్ అయింది అంటే ఇక  యాప్ టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది . ఈ క్రమంలోనే వచ్చిన ఫేస్బుక్ వాట్సప్ తదితర యాప్స్  ఇండియాలో బాగా పాపులర్ అయ్యి  ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టాప్ లో ఉన్న యాప్ లు అన్ని విదేశాలకు చెందినవే  కావడం గమనార్హం. 

 

 

 అయితే ఇండియాలో తయారు చేసిన ఏదైనా యాప్ టాప్ లో కొనసాగుతున్న విదేశీ యాప్స్ ని  బీట్ చేస్తుందా అంటే అది అసాధ్యం అనేది చెప్పాలి. కానీ ప్రస్తుతం అసాధ్యం సుసాధ్యమైంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న దిగ్గజ యాప్ లు  అన్నింటిని భారతీయ యాప్ అధిగమించి రికార్డు సృష్టించింది. అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్. ప్రస్తుతం ఈ యాప్ రికార్డులు సృష్టించింది. అయితే ఫేస్బుక్ యాప్ వచ్చిన మొదట్లో.. ఆ యాప్ కు ఐదు కోట్ల మంది యూజర్లు కావడానికి 19 రోజుల సమయం పట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు  ఐదు కోట్ల మంది యూజర్లు కావడానికి కేవలం  13 రోజుల సమయమే పట్టింది. 

 

 

 దీంతో ఫేస్బుక్ యాప్  రికార్డును బ్రేక్ చేసింది ఆరోగ్య సేతు యాప్. అతి తక్కువ రోజుల్లో ఎక్కువ యూజర్లను సొంతం చేసుకున్న ఇండియన్ యాప్ గా  రికార్డు సృష్టించాడు. కాగా ఈ నెల 14వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా  వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యసేతు  యాప్ లో ఇచ్చే సలహా మేరకు ఆ దేశ ప్రజలందరూ నడుచుకొని కరోనా ను  తరిమికొట్టాలని పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అతి తక్కువ సమయంలోనే ఐదు కోట్ల మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: