ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ను  ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలలో ప్రతి దేశం ఒక్కో ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమ దేశ పరిస్థితుల దృష్ట్యా వ్యూహాలను  అమలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి . కానీ కొన్ని దేశాలు మాత్రం కొన్ని వివాదాస్పద వ్యూహాలు అమలు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి.  ఇలా వివాదాస్పద వ్యూహంతో సత్ఫలితాలు పొందుతున్న దేశాల్లో ఇజ్రాయిల్, స్వీడన్ దేశాలు  ఉన్నాయి. అక్కడ కరోనా  వైరస్  ప్రభావం ఉన్నప్పటికీ లాక్ డౌన్  ప్రకటించలేదు కేవలం అక్కడి ప్రజలు... హెర్డ్ ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారని  అక్కడి ప్రముఖ అంటువ్యాధులు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే ఇది సత్ఫలితాలను ఇస్తుందని అక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ ప్రభావం ద్వారా మరి కొద్ది వారాల్లో దీని ప్రభావం పెరిగి  కరోనా  వైరస్ అదుపు చేస్తుంది అక్కడి శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. 

 

 

 అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు అక్కడి చీప్ ఎపిడమియోలజిస్ట్  డాక్టర్ అండర్స్  టెగ్నల్ తెలిపారు. ఇప్పటికే స్వీడన్ రాజధాని ప్రాంతమైన స్టాక్హోమ్ మొత్తం జనాభాలో 20 శాతం మంది... కరోనా ను ఎదుర్కోవటానికి  రోగనిరోధక శక్తిని సంతరించుకున్నారు అంటూ అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి కొన్ని వారాల్లో అక్కడి జనాభాలో హెర్డ్ ఇమ్యూనిటీ  పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని... అక్కడ క్రమక్రమంగా కరోనా మాయం అవుతుందని  అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిని కరోనా  ఏమీ చేయలేదు అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే.  ఈ సూత్రం ఆధారంగానే ఈ వ్యూహం అమలు అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అటు ఇజ్రాయిల్ దేశం కూడా తమ దేశ ప్రజల్లో  హెడ్ ఇమ్యూనిటీ  అభివృద్ధి చేసే విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ వ్యూహంలో లాక్ డౌన్ కి  ఎక్కడ స్థానం ఉండదు. డైరెక్ట్ గా ప్రజలు కరోనా ను ఎదుర్కుంటారు.  కరోనా దాడి చేసిన  కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం కారణంగా యువత తమ కార్యకలాపాల్లో మునిగిపోతు ఉంటారని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు . దీంతో కరోనా  వైరస్ సోకిన  ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల సులభంగానే కోలుకుంటారు. ఇలా కరోనా వ్యతిరేక రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఇలాంటి వారు రెండోసారి ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉండదు. దీంతో వీళ్లు వ్యాధి నిరోధకాలుగా మారిపోతారు. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఇలాంటి వారు దేశ జనాభాలో కనీసం 60 శాతం మంది ఉంటే కరోనా పై విజయం  సాధించినట్లే లెక్క. అయితే హెర్డ్  ఇమ్యూనిటీ ద్వారా కరోనా  వ్యాప్తి  క్రమ క్రమంగా తగ్గిపోతుంది అని చెబుతున్నారు. అయితే ఇందులో రిస్క్ ఏమిటి అంటే వృద్దులు  కరోనా  వైరస్ బారిన పడకుండా అతి జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: