దేశంలో కరోనా మహమ్మరి వేగంగా విజృంభిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సరైన ప్రణాళికతో మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుంది. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ఎక్కడ, ఎవరికి, ఎలా సోకుతుందో ఎవరికీ తెలీదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుంది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తుంపరల ద్వారా, షేక్ హ్యాండ్ ద్వారా, కరోనా వైరస్ సోకిన వారు తాకిన వస్తువులను తాకడం ద్వారా ఈ వైరస్ సోకుతుంది. క్వారంటైన్ కేంద్రాలకు చేరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదాయం లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. 
 
అయితే మనసు ఉంటే ప్రతి సమస్యకు మార్గం ఉంటుంది. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సర్పంచ్ లకు అధికారాలు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా విపత్తు నేపథ్యంలో హోం శాఖకు ఉన్న అధికారాలు వైద్య, ఆరోగ్య శాఖకు ఇచ్చింది. ఈ శాఖకు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఈ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కరోనా కట్టడి కోసం కేంద్రం కొన్ని అధికారాలు ఇచ్చింది. 
 
తాజాగా ఒడిశా ప్రభుత్వం తమకు ఉన్న విశేష అధికారాలను గ్రామ సర్పంచ్ లకు ఇచ్చింది. ఇకనుంచి ఒడిశాలో గ్రామ సర్పంచ్ లు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించవచ్చు. సర్పంచ్ మాటకు ఎదురు చెప్పే అధికారంఎవరికీ ఉండదు. మాట వినకపోతే వారిపై సర్పంచ్ లు కేసులు నమోదు చేయవచ్చు. గ్రామ సర్పంచ్ లకు గ్రామంపై పూర్తి అవగాహన ఉంటుంది. వీరికి అధికారాలు ఇవ్వడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: