జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న దానిపై టీడీపీ నేతలు విమర్సలు చేయడమే పనిగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం మంచిదా? చెడ్డదా? అని కనీసం ఆలోచన లేకుండా, ముందు విమర్శ చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జగన్ ఏ పథకం అమలు చేసిన దానిపై రాజకీయం చేస్తూ వచ్చారు.

 

అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. ఆ పథకాల పట్ల ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రతి పథకం గురించి విమర్సలు చేస్తూనే వచ్చారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల ఆర్ధిక పరిస్థితి కుదేలైపోయింది.

 

అయినా సరే జగన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగన్  దాదాపు 90 లక్షల మందికి పైగా మహిళలకు ఉపయోగపడేలా సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొస్తున్నారు. దాదాపు 1400 కోట్లు దీనికి కేటాయించారు. ఇలాంటి విపత్తు సమయంలో ఈ పథకం మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిపై కూడా టీడీపీ నేతలు విమర్సలు చేయడం మొదలు పెట్టారు.

 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈపథకంపై తీవ్ర విమర్సలు చేశారు. సున్నా వడ్డీ పథకంతో జగన్, మహిళల్ని మోసం చేస్తున్నారని, ఎన్నికల హామీలని మరిచిపోవడానికి, ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణ మాఫీ, చేసి మళ్ళీ వారికి కొత్తగా రుణాలు ఇస్తామని చెప్పారని,  ఇప్పుడు ఆ హామీలని మరిచిపోయేందుకు సున్నా వడ్డీని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు.

 

అయితే అనిత ఏ మాత్రం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏదైనా గుడ్డిగా విమర్సలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేశారు. ఈ కరోనా లేకపోతే డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యేది. కానీ ఇలాంటి సమయంలో కూడా జగన్ ఆలోచించి, మహిళలకు ఆర్ధిక సాయం చేయాలనే ఉద్దేశంతో సున్నా వడ్డీని తెచ్చారు. ఇక దీనిపై కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: