ఏపీలో కరోనా ఏ స్థాయిలో పెరుగుతుందో, అంతకంటే ఎక్కువ గానే దానిపై రాజకీయం జరుగుతుంది. ఇలాంటి విపత్కర సమయంలో అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉండకుండా, ఒకరిపై ఒకరు విమర్సలు చేసుకోవడంలో బిజీగా ఉంటున్నారు. పతిరోజూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి కృషి చేస్తున్నా,  టీడీపీ నేతలు మాత్రం ఓ రేంజ్ లో విమర్సలు చేస్తున్నారు.

 

అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏమైనా విలువలైన సలహాలు ఇచ్చిన వాటిపై వైసీపీ నేతలు విమర్సలు చేస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కాకుండా వేరే ఏ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వం విమర్సలు చేస్తుంటే, వారు కూడా బాబు డైరక్షన్ లోనే జగన్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అంటున్నారు.

 

ఈ క్రమంలోనే వైసీపీ నేత విజయసాయిరెడ్డి, ఎప్పటిలాగానే సోషల్ మీడియా వేదికగా బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు నిశ్చింతగా ఉంటే సీఎం జగన్‌కు ఎక్కడ పేరొస్తుందోనని బాబు ఏడుస్తున్నారని, చంద్రబాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయించాడని అన్నారు.

 

అలాగే గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేశాడని ఆరోపించారు. ప్రజలపై ఎందుకింత ద్వేషమని, వీరి వెనుక ఉన్నదెవరని చెబుతూ పరోక్షంగా వారిని చంద్రబాబే నడిపిస్తున్నారన్నట్లు విమర్సలు చేశారు.  ఇక విజయసాయి చేసిన కామెంట్లకు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా గట్టి కౌంటర్లే ఇస్తున్నారు.

 

అసలు ఇంగ్లీష్ మీడియం బాబు వ్యతిరేకించలేదని, టీడీపీ హయాంలోనే మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెట్టారని, ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కూడా ఉండాలని చెబుతున్నారని, అది కూడా మీడియం ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలని అంటున్నారని చెబుతున్నారు. అయినా బీజీపీ నేత కేసు వేస్తే బాబుకు సంబంధం ఏంటని అంటున్నారు.

 

ఇంకా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు హయాంలో ఎలా జరిగిందో అందరికీ తెలుసని, అయినా కరోనా సమయంలో పోలవరం నిర్మాణం చేపట్టవద్దని బాబు ఒక్క మాట కూడా చెప్పలేదని,  జనసేన నేత కేసు వేస్తే విజయసాయి, బాబు మీద పడి ఏడుస్తున్నారు ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి వైసీపీ నేతలకు నిద్రపట్టకపోతే చంద్రబాబే కారణమనేలాగా ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: