ఏపీలో టీడీపీ నేతలు పోటీపడి మరి జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. కరోనాని అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు జగన్ పై విమర్సలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్న కూడా, విమర్సలు చేయడం ఆపడం లేదు. అసలు కరోనా వ్యాప్తి కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని, కరోనా కేసులు పెరగడానికి అసలు వైసీపీ నేతలే కారణమంటూ అర్థంపర్ధం లేని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు డామినేషన్ రాజకీయాలు చేసున్నట్లు కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వైసీపీ నేతలపై తెగ ఫైర్ అయిపోతున్నారు. అసలు కరోనా వ్యాప్తి పెరగడానికి వైసీపీ నేతలే కారణమంటూ, కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీలపై ఒంటికాలి మీద వెళ్లిపోతున్నారు.

 

అదేవిధంగా జగన్ ప్రభుత్వం టార్గెట్ గా కూడా విమర్సలు గుప్పిస్తున్నారు. కరోనాని కట్టడి చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యారని, కేంద్రం ఇచ్చిన డబ్బులని, వైసీపీ వాళ్ళు, జగన్ ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడే టీడీపీలో డామినేషన్ మొదలయింది. జిల్లాలో అఖిలప్రియ తప్ప, మరొక నేత జగన్ పై విమర్సలు చేయలేదు. దీంతో ఎక్కడ అఖిలప్రియ డామినేషన్ ఎక్కువతుందనో లేక, తాము రాజకీయంలో వెనుకపడిపోయామని అనుకున్నారో తెలియదు గానీ, సడన్ గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు.

 

రావడం రావడమే జగన్ పై ఫైర్ అయ్యారు. కక్ష, ప్రతీకారాలు తప్పించి సీఎంకు ఏమీ పట్టవా? అంటూ విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే మీకు ఎన్నికలే ముఖ్యమా..? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా... లేక సీఎంగా వైఎస్ జగన్ పనికి రాడని చేతులెత్తేశారా..? అంటూ కొన్ని డైలాగులు వేసి, తాను కూడా జగన్ విమర్సలు చేయడంలో వెనక్కి తగ్గను అన్నట్లు ముందుకొచ్చారు. మొత్తానికైతే అఖిలప్రియ ఎక్కడ డామినేషన్ చేసేస్తుందేమో అని భయంతో కోట్ల బయటకొచ్చినట్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: