ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ఆర్థిక మండలి అభివృద్ధి సీఈవోగా కృష్ణ కిషోర్ పని చేశారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కృష్ణ కిషోర్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. 
 
క్యాట్ ఆ తరువాత ఆయన సస్పెన్షన్ ను రద్దు చేసింది. అయితే తాజాగా సస్పెన్షన్‌కు గురైన జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్ర‌మోష‌న్ లభించింది. ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్​కం టాక్స్ అధికారిగా ప్ర‌మోష‌న్ ఇస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఇప్పుడు కృష్ణకిషోర్ జగన్ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటారా...? అనే ప్రశ్న వినిపిస్తోంది. 
 
తనను ఇబ్బందులు పెట్టిన వారిని టార్గెట్ చేస్తారా...? చూడాల్సి ఉంది. జగన్ స‌ర్కార్ కృష్ణ కిషోర్ హయాంలో అవకతవకాలు జరిగాయంటూ ఆయనపై వేటు వేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారని.... ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారని.... నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 
ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానం దక్కటంతో కృష్ణ కిషోర్ ఎలా వ్యవహరిస్తాడో చూడాల్సి ఉంది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఆయనను సస్పెండ్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన అధికారికి ప్రమోషన్ రావడం జగన్ సర్కార్ కు షాక్ అనే చెప్పాలి.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: