ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా అవసరమైనవి టెస్టింగ్ చేయాల్సిన కిట్లతో పాటు కరోనా వైరస్ భారిన పడిన వారికి  సరైన వైద్య సదుపాయాలు కావాలి . ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో రోజు కరోనా  వైరస్ పెరుగుతోన్న నేపథ్యంలో  ప్రజలు ప్రత్యేకంగా బెడ్ లు  ఏర్పాటు చేయడంతో పాటు వారికి నిర్ధారణ పరీక్షలకు కిట్లు  ఏర్పాటు చేసుకున్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ రోగులకు ఉచితంగా ప్రత్యామ్నాయాలు చూడాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్  హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ లను వాడుకుంటున్నారు. 

 


 అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున బెడ్ల ఏర్పాటు జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కరుణ వైరస్  రోగులకు బెడ్ల  ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అటువంటి విషయాన్నీ  ఇండియాటుడే ఇచ్చిన ఓ కథనంలో తెలిపింది  . ఇది దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా  రోగుల కోసం బెడ్లు  ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో వెంటిలేటర్లు, సహా ఐసీయూ బెడ్లు నార్మల్ బెడ్లు  లక్షా అరవై వేలకు పైగా బెడ్లు  కరోనా పేషంట్ల  కోసం ఏర్పాటు చేయగ తమిళనాడులో.. 31, 808 బెడ్లు  ఏర్పాటు చేసింది.. ఆంధ్రప్రదేశ్లో 24, 534 బెడ్లు  ఏర్పాటు చేశారు. గుజరాత్ 12 వేలకు పైగా బెడ్లు ఏర్పాటు చేయగా.. రాజస్థాన్ 29 వేలకుపైగా బెడ్లు  ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రంలో 29 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు చేశారు. కేరళ 9 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు చేయాగ...  మధ్యప్రదేశ్ 30 వేల బెడ్లు... కర్ణాటకలో  15,000 పైగా బెడ్లు ఏర్పాటు చేశారు. 

 

 వెస్ట్ బెంగాల్ 9091 ఢిల్లీ 2003 బెడ్లని ఏర్పాటు చేసారు.  దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా  వైరస్ నియంత్రించడంతో పాటు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయా రాష్ట్రాలు కరోనా  వైరస్ బారిన పడిన వారి కోసం కిట్లు ఏర్పాటు చేయడంతోపాటు వారి కోసం ప్రత్యేకంగా బెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఐసియు బెడ్ తో పాటు వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఐసియు బెడ్ లు మరియు మాములు బెడ్స్  ఏర్పాటులో  ఆంధ్రప్రదేశ్ తాను మూడో స్థానంలో నిలిచింది. ఇలా ఆయా రాష్ట్రాలకు సంబంధించి వైరస్ ను  ఎదుర్కొనేందుకు ఇలాంటి సౌకర్యాలు కల్పించారు అనేది ఈ క్రింది వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: