ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న హడావిడికి ఢిల్లీ హైకమాండ్ నుండి అక్షింతలు పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇటీవల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరుపై జేపీ నడ్డా గట్టిగా క్లాస్ తీసుకున్నాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కరోనా వైరస్ పరీక్షల విషయంలో సౌత్ కొరియా నుండి కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్స్ విషయంలో అవినీతి జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం మనందరికీ తెలిసినదే.

 

 

దీంతో కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వైసీపీ అదే స్థాయిలో రివర్స్ కౌంటర్ వేసింది. జాతీయ వైద్యమండలితో పాటు కర్నాటక ప్రభుత్వం ఏపీ కంటే ఎక్కువ ధర చెల్లించి కిట్లను కొనుగోలు చేయటం జరిగిందని ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇవ్వాలని దిమ్మతిరిగిపోయే కౌంటర్ అటాక్ ఇవ్వటంతో ఈ వార్త పెద్ద హైలెట్ అయింది. జాతీయ స్థాయిలో కూడా వైరస్ టెస్టింగ్ కిట్స్ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అవినీతికి పాల్పడుతున్నట్లు వార్తలు రావటం స్టార్ట్ అయ్యాయి.

 

 

వెంటనే యాక్షన్ లోకి కేంద్రం దిగటంతో కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న గోల పట్ల సీరియస్ అయిందట. లోతైన అధ్యయనం లేకుండా ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై నోరుజార వద్దని జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా… కన్నా లక్ష్మీనారాయణ కి వార్నింగ్ ఇచ్చారట. ఏదైనా ఆరోపణలు ప్రత్యర్థులపై చేసేముందు జాతీయస్థాయిలో వాటికి ఆమోదం తెలిపితేనే అప్పుడు  విమర్శలు చేయాలని ఈ సందర్భంగా సూచించారట. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: