ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై  అధికార వైస్సార్ కాం,గ్రెస్ పార్టీ  నాయకత్వం చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టడం లో ఆ పార్టీ  రెండుగా చీలిందా ? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు . కన్నా పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు .

 

ఎన్నికల సమయం లో పార్టీ నిధుల్ని దుర్వినియోగం చేశారని ,  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారంటూ ఆయన  చేసిన ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి .  కన్నా పై విజయసాయి చేసిన ఆరోపణలపై  ఆ పార్టీ కి చెందిన పలువురు రాష్ట్ర స్థాయి నేతలు స్పందించారు . విజయసాయి విమర్శలను తిప్పికొట్టారు . అయితే అదే సమయం లో . పలువురు ప్రముఖులు మాత్రం మౌనముద్ర దాల్చడం రాష్ట్ర బీజేపీ రెండుగా చీలిందా అన్న  అనుమానాలకు తావునిస్తోంది . కన్నా నాయకత్వమంటే వారికి ఇష్టం లేదా ?, లేకపోతే   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు కన్నా 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారన్న విజయసాయి ఆరోపణలతో వారు  ఏకీభవిస్తున్నారా ? అన్న  సందేహాలు తలెత్తుతున్నాయి . 

 

ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల్లో తరుచూ తలదూర్చే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు , కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వంటి వారు  అధికార పార్టీ కి చెందిన ఎంపీ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన  స్పందించకపోవడం పలు  అనుమానాలు తావునిస్తోంది  . జీవిఎల్ , పురంధేశ్వరి వంటి రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా  వారు పార్టీ లైన్ లో స్పందించి ఉంటే బాగుండేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: