రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరి సెక్స్ చేస్తే కరోనా సోకుతుందా...? అనే సందేహం చాలా మందికి ఉంది. తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని తేల్చారు. 
 
పురుషుల వృషణాల్లో లేదా వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కొన్ని వైరస్ లు శృంగారం ద్వారా వ్యాప్తి చెందుదుతున్నప్పటికీ కరోనా మాత్రం వ్యాప్తి చెందడం లేదని అన్నారు. చైనాలో శాస్త్రవేత్తలు 34 మంది రోగుల వీర్యం నమూనాలను సేకరించి వీర్యంలో వైరస్ కనిపించలేదని తేల్చారు. కరోనా రోగులు సెక్స్ చేసినా వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందదని చెప్పారు. 
 
ప్రాథమిక అధ్యయనంలో సెక్స్ ద్వారా కరోనా సోకదని తేలిందని... దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సి ఉందని చెప్పారు. మరోవైపు దేశంలో నిన్నటివరకు 21,700 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,325 మందికి కరోనా నయం కాగా 686 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 80 కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలోని నాలుగు జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 234 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఒక్కరోజే 31 కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో నమోదైన కేసుల్లో 120 కేసులు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.           

మరింత సమాచారం తెలుసుకోండి: