వేడి నీళ్లతో స్నానం చేస్తే.. ఇక కరోనా వైరస్ మన దరికి రాదా.. ఒక వేళ మన బాడిపై కరోనా వైరస్‌ ఉన్నా.. వేడి నీళ్ల స్నానంతో కరోనా చచ్చిపోతుందా.. రోజూ మూడు సార్లు వేడి నీళ్ల స్నానం చేస్తే ఇక కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చా.. ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి.

 

 

కొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తే కరోనా రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొందరు మిడిమిడి జ్ఞానం ఉన్న వైద్యులు కూడా ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. వేడి నీళ్ల స్నానానికి కరోనాకు సంబంధం లేదు. కొందరు ఇలాంటి పిచ్చి సలహాలు విని మరిగే నీళ్లతో స్నానం చేయడం వంటి పనులు చేస్తున్నారు.

 

 

దయ చేసి అలాంటి పనులు చేయకండి. సాధారణంగా మన శరీరం ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మనం ఎప్పుడూ గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయడం మంచిది. మరీ వేడి నీళ్లయినా మన చర్మానికి హానికరమే.. ఇలాంటి పద్దతుల ద్వారా మనం కరోనా బారి నుంచి కాపాడుకోలేం.

 

 

మరి కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలంటారా.. ఇందుకు సరయిన పద్దతులను ఆశ్రయించాలి. తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తరచూ ముఖాన్ని చేతులతో తాకడం మానేయాలి. జనంలోకి వెళ్లేటప్పుడు నిత్యం మాస్కు ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించి కరోనా నుంచి కాపాడుకోవాలి. సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు ఏ వార్త అయినా సరే క్షణాల మీద ప్రపంచమంతా వ్యాపిస్తోంది.

 

 

ఫేస్ బుక్, వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అనేక వేదికలపై సమాచారం రాకెట్ వేగంతో స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట వచ్చిన సమాచారం తప్పయినా సరే.. ఆ విషయం గమనించేలోగానే అది కోట్ల మందికి చేరిపోతోంది. అలా అనేక తప్పుడు విషయాలు జనంలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: