కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న వైరస్ ఇది. ఇప్పటికే లక్షన్నర మందికిపైగా పొట్టనపెట్టుకుంది. దీని స్పీడు రోజురోజుకూ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ప్రపంచమంతా లాక్ డౌన్ వంటి పద్దతులతో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్నా దీని జోరు మాత్రం తగ్గడం లేదు. కొత్త కేసులు లక్షల కొద్దీ నమోదవుతున్నాయి. దీనికి ఎలాంటి మందూ లేకపోవడమే అసలు సమస్యగా మారింది.

 

 

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. కానీ వ్యాక్సీన్ తయారీ అనేది రోజుల్లో అయ్యే వ్యవహారం కాదు కదా. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ ఏంటంటే.. కరోనా వ్యాక్సీన్ ఇప్పటికే ఎలుకలపై విజయవంతం అయ్యిందట. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉందని.. మూడు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

 

 

ఇప్పటికే.. కరోనా వ్యాక్సిన్లను కోతులు, ఎలుకలపై నిర్వహించారట. తొలిదశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాల్లో జంతువుల శరీరాల్ల సార్స్-కోవ్-2 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. కోతులకు మొదటి డోస్ కింద మూడు మైక్రో గ్రాములు, రెండో డోస్ కింద ఆరు మైక్రో గ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారట. దీని ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించిందని సైంటిస్టులు చెబుతున్నారు.

 

 

కరోనా కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ దాదాపు 10 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందట. ఈ ప్రయోగం సక్సస్ కావడంతో ఇక త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడే ఈ కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడేది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: