రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన ఆంక్షలు  అమలు చేస్తున్నప్పటికీ కరోనా కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మొదట వందల్లో  ఉన్న కరోనా కేసులు సంఖ్య వేలల్లో కి ఆ తర్వాత  పదివేలు తర్వాత  20000 మించిపోయింది మన దేశంలో . రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 700 మందిని ఈ మహమ్మారి వైరస్ బారినపడి మృతి చెందారు. ఇక ఎంతో మంది మృత్యువుతో పోరాడుతున్నారు. 

 

 

 అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజలను ఇంటికే పరిమితమైయ్యేలా చేసి కరోనా  వైరస్ నుంచి దూరంగా ఉండేలా చేయడంతో పాటు కరోనా  వైరస్ సోకిన రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు  చేపడుతూనే  ఉంది. అయితే ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న కరోనా  వైరస్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.తాజాగా ఉత్తరాఖండ్ లో తొమ్మిది నెలల వయసున్న ఓ పసికందు కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో  పోరాటం చేశాడు. 

 

 ఇంకా లోకానికి కూడా సరిగా చూడని 9 నెలల పసికందు ప్రపంచ మహమ్మారిపై విజయం సాధించింది. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తూ  ఎంతో మందిని బలి తీసుకుంటున్న మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన తొమ్మిది నెలల బాబును  ఏప్రిల్ 17న ఆస్పత్రిలో చేర్పించారు. కాగా గురువారం ఆ పసికందును డిశ్చార్జి చేశారు వైద్యులు. ఆరు రోజుల వ్యవధిలోనే పది నెలల చిన్నారి మహమ్మారి నుంచి బయటపడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 48 గంటల వ్యవధిలోనే రెండుసార్లు ఆ చిన్నారికి నెగిటివ్ వచ్చింది. అయితే సదరు చిన్నారికి తండ్రి ద్వారా కరోనా సోకి  ఉంటుందని భావిస్తున్నారు. శిశువు తండ్రి కు జమాత్ కి  వెళ్లి రాగా  ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆ చిన్నారిలో కరోనా  లక్షణాలు ఏమాత్రం కనిపించలేదని నవ్వుతూ హాయిగా ఆడుకోన్నాడని  చికిత్స అందించిన డాక్టర్ అగర్వాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: