దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వైద్యులను సైతం షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో డాక్టర్లకు కరోనా రోగుల రక్తంలో అనేక మార్పులు కనిపించాయి. రోగుల రక్తంలో కనిపించిన మార్పులు వైద్యులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 
 
కరోనా సోకిన రోగుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు వైద్యులకు కనిపించాయి. కొందరిలో రక్తం చిక్కబడిపోతుంటే, మరికొందరిలో రక్తం పాలిపోతూ ఉండటంతో వైద్యులకు వారిని చూసి ఏం చేయాలో పాలుపోలేదు. వైద్యులు కరోనా వైరస్ రక్తాన్ని పాలిపోయేలా, చిక్కబడేలా చేసి మానవ శరీరoపై దుష్ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు కిడ్నీ డయాలసిస్ కోసం ఉపయోగించే కేథరెట్లపై గడ్డ కట్టిన రక్తం ఉండటం గమనించారు. 
 
పల్మనాలజిస్టులు కొందరు రోగుల్లో ఊపిరితిత్తులలోని కొన్ని భాగాల్లో రక్తం చుక్క కూడా లేకపోవడాన్ని గుర్తించారు. కరోనా ఊపిరితిత్తుల్లోనే కాదు రక్తంలో కూడా మార్పులు చేస్తున్నట్టు గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకడుతూ... పాలిపోతూ ఉండటంతో చికిత్స విధానంలో మార్పులు చేయాలని వైద్యులు భావిస్తున్నారు. జెఫర్సన్ యూనివర్సిటీకి చెందిన వైద్యుడు పాస్కల్ మాట్లాడుతూ తాను మరే వైరస్ లో ఇలాంటి లక్షణాలు చూడలేదని అన్నారు. 
 
రోజురోజుకు కరోనా గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో మరింత భయం పెంచుతున్నాయి. మరోవైపు కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్యులు భావిస్తున్నారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే మాత్రం అతి త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: