పొగాకు ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ కి కారకం... పొగాకు ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసింది... ఈ మాటలన్నీ మనం ఏ సినిమా చూడాలనుకున్న ముందు కనిపిస్తూ ఉంటాయి. నిజంగానే పొగాకు ఆరోగ్యానికి హానికరం. కానీ తాజాగా పొగాకు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. పొగాకు తాగడం ద్వారా అందులోని నికోటిన్ కరోనా వైరస్ శరీరంలోని రక్త కణాలకు అంటకుండా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఫ్రాన్స్కు చెందిన రీసెర్చర్లు బృందం తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఇప్పటి వరకు తాము పరిశీలించిన గణాంకాల ప్రకారం చూస్తే... పొగాకులోని నికోటిన్ కరోనా  వైరస్ను రక్తకణాలకు అంటకుండా అడ్డుకోవడంలో విజయం సాధిస్తుంది అని తెలిపారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాకుండా మరింత అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు  సదరు శాస్త్రవేత్తలు తెలిపారు . 

 

 

 అయితే పొగాకు కారణంగా మానవ శరీరంలోని ఇతర గ్రహాలను పట్టుకొని ఉండే నికోటిన్... నికోటిన్ కణం  దగ్గరికి వచ్చిన కరోనా  వైరస్ అనే సూక్ష్మజీవి నీ ఆ కణం లోకి  వెళ్ళకుండా... అడ్డుకోవడమే కాకుండా శరీరమంతా వ్యాపించకుండా కూడా అడ్డుకోవడానికి అవకాశం ఉంది అంటూ తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక నికోటిన్ విషయంలో తదుపరి అధ్యయనం కోసం ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది గణాంకాల ప్రకారం మొత్తంగా 26 శాతం మంది పొగతాగే అలవాటు ఉన్న వారు ఉంటే వారిలో కేవలం 12.6 శాతం మంది మాత్రమే కరోనా  సోకిన వారు ఉన్నారు అంటూ తెలిపారు. 

 

 

 అయితే ఈ విషయంలో తదుపరి పరిశోధనలు జరిగి స్పష్టమైన నిర్ణయానికి వచ్చేంత వరకు ప్రజలు కరోనా  వైరస్ బారినుంచి తప్పించుకోవడానికి కొత్తగా పొగాకు తాగడానికి అలవాటు పడరాదు అంటూ శాస్త్రవేత్తలు సూచించారు. అదేవిధంగా నికోటిన్  వాడితే కరోనా దరిచేరదు అని భావించడం కూడా సరికాదు అంటు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే నికోటిన్ శరీరానికి రుగ్మతలను కలగిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు..ఈ విషయాన్నీ అందరూ గుర్తు పెట్టుకొని నికోటిన్ కు  దూరంగా ఉండాలని అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: