ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ దెగ్గరలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర రాజధాని కోసమని ఈ ఎయిర్ పోర్ట్ లో అనేక మంది రాకపోక సేవలు ఎక్కువ అవడంతో ప్రస్తుతం ఉన్న టెర్మినల్ నుంచి కాస్త ఇబ్బందులు ఉండగా దానిని పరిశీలించి కొత్త టెర్మినల్ ను నిర్మించాలని అధికారులు సూచించడంతో ఇప్పుడు అది కాస్త ముందుకి సాగింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే... 

 

విజయవాడ దగ్గరలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ కు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తాజాగా ఆమోదం తెలియజేయడం జరిగింది. దీనితో గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం చేయడం కోసమే ఈ ఆమోదం లభించింది అనే చెప్పాలి. ఇక సుమారు 613 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టపోతున్న ఈ టెర్మినల్ కు కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలియజేయడం జరిగింది.

 


అయితే ప్రస్తుతానికి మాత్రం పాత కర్మినగర్ భవనాన్ని ఇంటర్నేషనల్ పనుల కోసం తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 31 వేల చదరపు అడుగుల్లో ఇంటిగ్రేషన్ టెర్మినల్ నిర్మాణం చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టెండర్లు కూడా వేయడం జరిగింది. ఇక ఈ నిర్మాణం కోసం ఐదు నిర్మాణ రంగ కంపెనీలు టెండర్లు వేయగా.. అందులో ఒక కంపెనీ సాంకేతిక అంశాల విషయంలో సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణ చేయడం జరిగింది. 


ఇక మిగిలిన కంపెనీలలో NKG ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తక్కువ ధరకు నిర్మాణం ప్లాన్ చేయడం ద్వారా ఎల్‌ - 1 గా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర క్యాబినెట్ నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించి కేవలం రెండు సంవత్సరాల్లోనే  ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆ కంపెనీ లక్ష్యంగా ఉందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: