దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు  చాస్తూ ఎంతో మందిని బలి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ మహమ్మారికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. క్రమక్రమంగా పెరిగిపోతున్న ఈ మహమ్మారి వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా ఎంతో మందిని బలి తీసుకుంటుంది. అయితే మొన్నటి వరకు కేవలం వృద్ధులు ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎక్కువగా మరణిస్తున్నారు అని అనుకున్నప్పటికీ ఇప్పుడు అభం శుభం తెలియని లోకాన్ని  కూడా సరిగ్గా చూడండి చిన్నారులు... ప్రస్తుతం మరణిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల మరణం ఎంతో మందిని కలిచి వేస్తోంది. 

 

 ఇక ఈ మహమ్మారి వైరస్ ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చిన ఎన్ని ఆంక్షలు విధించిన కొంత మంది నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలి కావాల్సిన  దుస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రజలు రోజురోజుకు ప్రాణభయం బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలను తీసే మహమ్మారి వైరస్ ఎటు నుంచి దాడి చేసి కాటికి  పంపిస్తుందో  అనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతును  వెళ్లదీస్తున్నారు దేశ ప్రజలు. ఇక తాజాగా కేరళలో కరోనా  మరణం ఎంతో మంది హృదయాలను కలిచివేసింది . 

 

 

 కరోనా వైరస్ బారినపడి అభం శుభం తెలియని నాలుగు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఈ పసికందుకు హృదయ సంబంధ సమస్య ఉంది. ఈ క్రమంలోనే సదరు చిన్నారిని ఈనెల 21న స్థానిక మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. ఇక సదరు చిన్నారికి నిమోనియా లక్షణాలు ఉండడంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఇక తాజాగా ఆ చిన్నారి ఆరోగ్యం  క్రమ క్రమంగా క్షీణించి ఈరోజు ఉదయం మరణించినట్లుగా... మల్లపురం జిల్లా వైద్య అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ ధృవీకరించారు. అయితే సదరు నాలుగు నెలల చిన్నారికి వైరస్ ఎలా సోకింది  అనే ఈ విషయాన్ని కనుగొనేందుకు అధికారులు దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: