ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి  కరోనా  వైరస్ కోరలు చాస్తూ శరవేగంగా వ్యాప్తి చెందుతూ.. అన్ని దేశాలను కబళిస్తుంది. ఈ  నేపథ్యంలో దాదాపుగా అన్ని దేశాలు తమ దేశంలో లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇంటిపట్టునే ఉంటూ పని చేసుకుంటున్నారు. ప్రస్తుతం సాధారణ కంపెనీలతో పాటు మల్టీ నేషనల్ కంపెనీల వరకు వర్క్ ఫ్రం హోం అవలంభిస్తున్నాయి. ఇక వర్క్ ఫ్రం హోం అన్నప్పుడు ఉద్యోగులను  అలాగే వదిలేస్తే సరిపోదు కదా. యాజమాన్యాలు ఎప్పటికప్పుడు తమ తమ ఉద్యోగులను ఫాలప్  చేస్తూ ఉండాలి. సూచనలు సలహాలు ఇస్తూనే ఉండాలి. ఈ క్రమంలోనే లాక్ డౌన్  సమయంలో వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఎప్పటికప్పుడు కాంటాక్ట్ కొనసాగిస్తున్నారు. 

 

 

 అయితే దాదాపుగా అన్ని కంపెనీల ప్రతినిధులు ఈ వీడియో కాన్ఫరెన్స్ల కోసం ఎక్కువగా జూమ్  యాప్ ను వినియోగిస్తున్నారు. జూమ్ యాప్  ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కంపెనీ వర్క్ కు సంబంధించిన పలు విషయాలను చర్చించుకుంటున్నారు.. దీంతో రోజురోజుకు జూమ్ యాప్  వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతుంది. అయితే మార్చి వరకు 200 మిలియన్ల యూజర్లు జూమ్ యాప్ కు  ఉండగా.. కేవలం ఏప్రిల్ నెలలోనే ఏకంగా 100 మిలియన్లకు పైగా యూజర్లు పెరిగిపోయి మొత్తంగా 300 మిలియన్ లకు జూమ్  యాప్ వినియోగదారుల సంఖ్య పేరిగింది. 

 

 

 అయితే గతేడాది డిసెంబర్లో కేవలం జూమ్ యాప్  వినియోగిస్తున్న వారి సంఖ్య 10 మిలియన్లు మాత్రమే ఉండేది. ఇక ఆ తర్వాత పలు దేశాల్లో లాక్ డౌన్  విధించడంతో క్రమక్రమంగా వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మార్చి నాటికి 200 మిలియన్ల యూజర్లు ఉండగా మూడు వారాల్లోనే 300 మిలియన్ యూజర్లకు చేరుకుంది జూమ్ యాప్ . అయితే జూమ్  యాప్  సురక్షితమైనది కాదని సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ యాప్ వినియోగించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.అయితే ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగలించే  అవకాశం ఉందని మరోవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: